చాక్లెట్ మిల్క్ షేక్(Chocolate milkshake) అందరికి ఫేవర్ట్(Favorite) మిల్క్ షేక్. సాధారణంగా ఈ పానీయం పశ్చిమంలో, ముఖ్యంగా USAలో బాగా ప్రాచుర్యం పొందింది, ఇక్కడ మిల్క్‌షేక్ లేకుండా బర్గర్ మరియు ఫ్రైస్ల భోజనం ఎప్పుడూ పూర్తికాదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, ఈ పాల ఆధారిత పానీయం(Milk based Drink) భారతీయ ఆహారంలో కూడా సర్వసాధారణంగా మారింది. పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ ఇష్టపడే మిల్క్ షేక్‌లలో చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి.. కోకో పౌడర్(Coco Powder), పాలు(MilK), పంచదార(Sugar) మరియు చాక్లెట్ ఐస్ క్రీం(Chocolate Ice Cream)తో చాక్లెట్ మిల్క్ షేక్ రెసిపీ(Recipe) తయారుచేసే సూపర్ ఈజీ(Easy)గా, రుచికరం(Tasty)గా చేసుకునే రెసిపీ. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో తేలుకుందాం!
కోకో సిరప్ కోసం కావాల్సిన పదార్దాలు:
గోరువెచ్చని నీరు – ¼ కప్పు
కోకో పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు
చక్కెర – ¼ కప్పు
ఇతర పదార్థాలు
చల్లని పాలు – 2.5 కప్పులు
ఐస్ క్యూబ్స్ – 6 నుండి 8 (ఆప్షనల్)
చాక్లెట్ ఐస్ క్రీం – 2 నుండి 3 స్కూప్‌లు (ఆప్షనల్)
చాక్లెట్ సాస్ – 2 నుండి 3 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్)
కోకో సిరప్ తయారు చేసే విధానం:
ఒక చిన్న గిన్నెలో, వెచ్చని నీటిని తీసుకోండి.3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, షుగర్ గోరువెచ్చని నీటిలో వేసి కరిగిపోయేలా బాగా కలపండి. కోకో సిరప్ లా తయారీయే వరకు బాయిల్ చేయండి.
చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేయడం
ఇప్పుడు ఈ కోకో సిరప్‌ను బ్లెండర్ లేదా మిక్సర్‌లో వేసి,.కొన్ని ఐస్ క్యూబ్స్ మరియు 2.5 కప్పుల పాలు పోసి మెత్తగా అయ్యే వరకు కలపండి. గ్లాసుల వైపులా కొన్ని చాక్లెట్ సిరప్ వేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు తయారు చేసుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ ను గ్లాసుల్లో పోయాలి.
ఆ తరువాత ఒక స్కూప్ చాక్లెట్ ఐస్ క్రీం వేసి వెంటనే సర్వ్ చేయండి. టేస్టీ, యమ్మీ చాక్లెట్ మిల్క్ షేక్ ని ఎంజాయ్ చేయండి.