యోగా(Yoga) కేవలం శారీరకం(Physical)గానే కాకుండా మానసిక ఆరోగ్యాని(Mental Health)కి కూడా ఎంతో సహాయ పడుతుంది. ఎన్నో సంవత్సరాలు(Years)గా యోగాను మన భారతదేశం(India)లో ప్రాక్టీస్(Practice) చేస్తూ వచ్చారు. అయితే యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయి.
మీకు ఎలాంటి సమస్య ఉందో అది శారీరిక సమస్య అయినా లేక మానసిక సమస్య అయినా సరే దాని ప్రకారం ఆసనాలను ఎంపిక చేసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు, శారీరక లేక మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలనే వారు ఎవరైనా సరే యోగాను ప్రాక్టీస్ చేయవచ్చు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే యోగ వల్ల డయాబెటిస్(Diabetes)ను కూడా నియంత్రించు(Control)కోవచ్చు. అటువంటి సందర్భాలలో గ్లూకోస్(Glucose) అనేది రక్తంలో ఉండిపోతుంది మరియు కణాలకు చేరదు దాంతో డయాబెటిస్ తీవ్రత కూడా పెరుగుతుంది మరియు ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరి చేరుతాయి.
నిజానికి డయాబెటిస్‌కు ఎలాంటి చికిత్స లేదు కేవలం మీరు తీసుకున్నటు వంటి మందులతో నియంత్రించుకోవలసిందే.
మన భారత దేశంలో 50 మిలియన్ల జనాభా(Population) వరకు టైప్ 2(Type 2) డయాబెటిస్తో బాధ పడుతున్నారు. అందుకే మన దేశమే డయాబెటిస్‌కు రాజధాని అని నిపుణులు అంటున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పవచ్చు. కానీ నిపుణులు(Experts) ఇచ్చిన సమాచారం ప్రకారం ఎప్పుడైతే క్రమం తప్పకుండా యోగాను ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు.
అంతే కాకుండా కొన్ని సందర్భాల లో పూర్తిగా నయం చేసుకోవచ్చు అని కూడా తెలిపారు యోగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్(Blood Circulation) మెరుగు పడుతుంది దానితో పాటుగా డయాబెటిస్ యొక్క లక్షణాలను కూడా త్వరగా తగ్గించుకో వచ్చు, దానితో పాటు హైపర్ టెన్షన్(Hyper tension), ఒత్తిడి మరియు అధిక బరువు మొదలైనవి కూడా తగ్గించుకోవచ్చు.
రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ సమస్య వస్తుంది. దానినే బ్లడ్ షుగర్ అని కూడా అంటారు. రక్తంలో ఉండేటు వంటి గ్లూకోజ్ మనకు ఎనర్జీని ఇవ్వడానికి పని చేస్తుంది ఈ గ్లూకోజ్ మనం తీసుకునే ఆహారం ద్వారా లభిస్తుంది.
పాంక్రియాస్(Pancreas) ఇన్సులిన్(Insulin) అనే హార్మోన్(Hormone)ని ఉత్పత్తి(Produce) చేస్తుంది. దాని వల్ల మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్ రూపంలో కణాల(Cells)కు అందుతుంది మరియు శక్తి లభిస్తుంది. అయితే కొన్ని సార్లు మన శరీరాని(Body)కి కావలసినటు వంటి ఇన్సులిన్ లభించదు. మరి కొన్ని సార్లు ఇన్సులిన్ సరైన విధంగా ఉపయోగపడదు.
సరైన జీవన విధానం(Life style) లేకపోవడం అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, మానసికంగా ఒత్తిడికి గురవడం, శారీరకంగా ఎటువంటి పనులు చేయకపోవడం మరియు ఇతర కారణాల వల్ల డయాబెటిస్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి రోజు యోగాను అలవాటు చేసుకోండి. అంతే కాకుండా ఆహారంలో ఆరోగ్యకరమైన మాత్రమే తీసుకోండి.
డయాబెటిస్ వల్ల ఊబకాయం సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి డైట్(Diet) కచ్చితంగా ఫాలో అవ్వండి. ధనురాసనం(Dhanuraasanam), చక్రాసనం(Chakraasanam), మత్స్యాసనం(Masthyasanam) తో రెగ్యులర్(Regular) గా యోగ చేయడం ద్వారా షుగర్ కంట్రోల్ ఉంటుంది.
డయాబెటిస్‌ను నియంత్రించడానికి ప్రతి రోజు ఈ ఆసనాలను ప్రాక్టీస్(Practice) చేయండి.