బిగ్ బాస్ సీజన్5(Big Boss season 5) లో కెప్టెను టాస్క్ లో హౌస్ మేట్స్(House mates) మధ్య పొరపొరి గా పోటీ నడిచింది. ఒక్కరిని ఒక్కరు టార్గెట్ చేసి ఆటలో తమ సత్తా చూపెడుతూనే, గ్రూపులు గా గేమ్ ఆడారు. దింతో అసహనం చూపెట్టిన హౌస్ మేట్స్.
ఈ వారం కెప్టెన్(Captain) గా షన్ను ఎంపికయ్యాడు. కానీ హ్యూస్ మేట్స్ లో కొందరు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రేషనల్ మేనేజర్(Rational Manager) గా యాని మాస్టర్ ని ఎంపిక చేసారు.
మరి నిన్నటి 55వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ చూద్దాం.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్(Captaincy Task) లో జరిగిన గొడవల పై అసహనాన్ని వ్యక్తపరుస్తాడు సన్నీ. తాను, మానస్ ఎలా ఓడిపోయామని చెప్తారని కోపం తో చిందులేస్తాడు.
ఇదంతా హౌస్‌లో నుంచి చూసిన రవి, సన్నీతో మాట్లాడు కానీ మానస్‌తో మాట్లాడొద్దు అని జెస్సీకి అడ్వైజ్ ఇచ్చాడు. ఆటలో ఉన్నప్పుడు గ్రూపులుగా ఆడితే మండుతుందని నిప్పులు చెలరేగాడు శ్రీరామ్.
మరోపక్క రవి ఈవారం పెద్దగా పర్ఫామ్ చేయలేదని అభిప్రాయపడ్డాడు షణ్ను. అటు కాజల్ మాత్రం శ్రీరామ్ ఇంకా మాస్క్ తీయలేదని సన్నీ, మానస్‌లతో చెప్పుకొచ్చింది.
అటు శ్రీరామ్ నామినేషన్స్(Nominations) తప్పించుకునేందుకు కాజల్ కాంట్రవర్శీల(Contraversary)కు పోవడం లేదని పేర్కొనగా రవి అవునని ఏకీభవించాడు. ఆమెను సేఫ్ ప్లేయర్(Safe Player)గా అభిప్రాయబడ్డాడు.
తర్వాత హౌస్‌లో వరస్ట్ పర్ఫామర్(Worst Performer) ఎవరో చెప్పాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ముందుగా కెప్టెన్(Captain) షణ్ను నీ ఫ్రెండ్స్ వల్ల నీ గేమ్ కనిపించలేదంటూ కాజల్ పేరు చెప్పాడు .
సన్నీ సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు. ఇక మానస్ కూడా సంచాలకుడిగా సరిగా పని చేయలేదని జెస్సీనే వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు .
రవి, సిరిలు సన్నీని; యానీ.. ప్రియాంకను; ప్రియాంక సింగ్, లోబో.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా తెలిపారు. టాస్క్‌లో శ్రీరామ్ ప్రవర్తన ప్రొవోకింగ్‌గా అనిపించిందని చెప్పింది కాజల్. తర్వాత జెస్సీ సన్నీని వరస్ట్ పర్ఫామర్ అని చెప్పే క్రమంలో వీళ్లిద్దరికీ మరోసారి వాగ్వాదానికి దిగి రణరంగాన్ని సృష్టించారు.
తరువాత మానస్ టాస్క్(Task) ఆడే విధానం ఎలా ఉందో వివరిస్తూ పేపర్లో రాసి ఉన్నది చదివి హౌస్ మేట్స్(House mates) కి వినిపించాడు.
మొదటి రెండు రౌండ్స్ లో మొదటి సర్కిల్లో నడవాలి. నెక్స్ట్ రౌండ్లో రెండో సర్కిల్లో నడవాల్సి ఉంటుంది. ఆఖరి రౌండ్లో చివరి సర్కిల్లో నడవాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 5 రౌండ్స్ ఉంటాయి. మొత్తం ఆరుగురు కంటెంట్స్(Contents) ఉంటే ఐదు రౌండ్లు ఉంటే.
సింగిల్ సింగిల్ ఎలిమినేషన్(Elimination) అవుతారు. మరి జెస్సీ ఒకేసారి ఇద్దర్ని ఎలా ఎలిమినేట్ చేస్తాడంటూ అసలు పాయింట్‌ను బయటకు పెట్టాడు.
నీ గేమ్ నువ్వు ఆడు, పక్కవాళ్ల గేమ్ ఆడకు అని వార్నింగ్ ఇస్తూ కాజల్ చెత్త గా ఆడిందన్నాడు శ్రీరామ్. మొత్తంగా ఈ టాస్క్(Task) ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్(Captain) షణ్ను సన్నీ బస్తాను తన్నడం నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్(Worst Performer)గా ప్రకటించడానికి సిద్ధ పడ్డాడు.
అయితే సన్నీ కలగజేసుకుని నేను ఎవరిని ఫిసికల్ గా అటాక్ చేయలేదు బస్తాను తంతే ఫిసికల్ ఎటాక్ అవ్వుతుందా అని వాగ్వాదనకు దిగుతాడు. దానికి షన్ను ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు హౌస్ మేట్స్(House mates) అందరి అభిప్రాయం అని అంటాడు.
ఎవరు అన్నారు హౌస్ లో అన్నగానే జెస్సీ సిరి చేతులెత్తి తాము కూడా అదే అభిప్రాయపడ్డాం అని అంటారు. దాంతో సిరి,షన్ను, జెస్సీ లతో గొడవ పెట్టుకున్న సన్నీ.
సిరి కత్తి పట్టుకోవడం తప్పు కాదా? అని ప్రశ్నించాడు జెస్సీని కావాలని తన్నాను అని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతానన్నాడు. అతడికి మద్దతుగా రంగంలోకి దిగి వాదనకు దిగారు మానస్, కాజల్.
చివర్లో యానీ తన ఓటును సన్నీకి ఇవ్వడంతో ఇంట్లో అందరికన్న ఎక్కువగా సన్నీకే 4 ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని జైల్లో వేశారు.