మహిళల(Women)కు వయసు మీద పడుతున్న కొద్దీ కోపం, చిరాకు, భావోద్వేగాల(Emotional) కి లోనవడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంది. అయితే వీటికి ప్రధాన కారణం హార్మోన్ల(Hormones) ప్రభావమే.
ఇవి మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మెనోపాస్(Menopause), రుతుస్రావం(Menstrual Discharge), గర్భం దాల్చడం(Pregnancy), గర్భ నిరోధక మాత్రలు(Contraceptive Pills) వేసుకోవడం, జీవన శైలి(Life style) మార్పులు నిద్ర వేళలు మారిపోవడం, ఒత్తిడి(Stress), పౌషిటకాహారం(Good food) తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల హార్మోన్ సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ఈ హార్మోన్ సమస్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో హైపో థైరాయిడ్(Hypo Thyroid), పిసిఓడి(PCOD), సంతానలేమి(Infertility), డయాబెటిస్(Diabetes),వంటి దీర్ఘకాలిక జబ్బులు(Chronicle Disorders) ఎక్కువగా వస్తున్నాయి. ఇవ్వని హార్మోన్ల అసమతుల్యత(Hormones imbalance) వల్ల వచ్చే జబ్బులే.
ఈ హార్మోన్లు మనవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.ఈ హార్మోన్లు ఎండోక్రైన్(Endocrine), ఎక్సోక్రైన్ గ్రంధు(Exocrine Glands)ల నుంచి ఉత్పత్తి(Produce) అవుతాయి. శరీరంలో ఇవి సూక్ష్మ(Micro) మోతాదులో ఉత్పన్నమైనప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో ఈ హార్మోన్లు అసమతుల్యతకు గురైనప్పుడు, తీవ్రమైన వ్యాధుల బారినపడతారు. థైరాయిడ్ గ్రంధి(thyroid Gland) నుంచి టి౩, టి4 హార్మోన్లు(T3,T4 Hormones) ఉత్పత్తవుతాయి. వీటి ప్రభావం 90 శాతం జీవనక్రియల పై ఉంటుంది. వీటి అసమతుల్యత వల్ల హైపో థైరాయిడ్(Hypo Thyroid), హైపర్ థైరాయిడ్(Hyper Thyroid), గాయిటర్(Goiter) అనే జబ్బులు వస్తాయి.
గొంతు కింద వుండే థైరాయిడ్ గ్రంధి వాపుకు గురికావడాన్ని గాయిటర్(Goiter) అంటారు. ఇది ముఖ్యంగా అయోడిన్(Iodine) లోపం వల్ల వస్తుంది. దీనికి శస్త్రచికిత్స చేయడం వల్ల థైరాయిడ్ సమస్యల(Thyroid problem)కు జీవిత కాలం(Life Time) మందులు వాడే అవసరం లేకుండా చేస్తుంది.ఈ హార్మోన్ల అసమతుల్యత(Hormone imbalance) వల్ల రుతుచక్రతా సమస్యలు (Menstrual Problems), అవాంఛిత రోమాలు(Unwanted Hairs), సంతాన లేమి(Infertility) వస్తాయి.
హార్మోన్ సమస్యలు ఒకదానితో మరొక్కటి అనుసంధానమయ్యి ఉంటాయి. హార్మోన్ అసమతుల్యతను సరి చేయడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఋతుసమస్యలు, పిసిఓడి సమస్యలు, సంతానలేమి, శుక్రకణ సమస్యలు నయం చేయవచ్చు.
డయాబెటిస్ ఇన్సిపిడ్స్(Diabetes Insipidus) అనే వ్యాధి ఎడిహెచ్(ADH) లోపం వల్ల వస్తుంది. దీన్ని అతి మూత్ర వ్యాధి అంటారు. డయాబెటిస్ ని తొందరగా గుర్తించి తోలి దశలో చికిత్స తీసుకుంటే సంపూర్ణంగా నయం అయ్యే అవకాశం వుంది. మందుల ద్వారా షుగర్ ని అదుపులో వుంచుకోవడమే కాకుండా కాంప్లికేషన్స్(Complications) ని నివారించుకోవచ్చు.
కరోటిక్ స్టెరాయిడ్స్(Corotic Steroids) అనేవి ఆడ్రెనోల్ గ్రంధి(Adrenal Gland) నుంచి విడుదలవుతాయి. ముఖ్యమైన జీవన క్రియల్లో రోగ నిరోధక(Immunity) వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్య వల్ల క్యూషింగ్స్(Cushings), అడ్డిస్న్స్(Addisons) వ్యాధులు వస్తాయి. హార్మోన్ సెల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిముమ్ (Hormone Cell Genetic Constitutional semilimum) వంటి అత్యుత్తమ పద్ధతుల ద్వారా హార్మోన్ సమస్యలకు ఖచ్చితమైన వైద్యం అందించవచ్చు.
హార్మోన్ల సమస్యల కారణంగా మహిళల్లో వచ్చే అకారణ పిరియడ్లు(Irregular Periods). బహిష్టు సమయంలో కడుపు నొప్పులు(Stomach ache) లేదా రక్త స్రావం అధికంగా(Over Bleeding) ఉండడం వంటివన్నీ ఆహారంతో నివారించుకోవచ్చు.
హార్మోన్ లెవెల్ పెరిగిన కారణంగా గర్భాశయం గడ్డలు ఏర్పడటం వల్ల కూడా అధిక రక్త స్రావం అయ్యే అవకాశం వుంది. కాబట్టి పాలు, పెరుగు, వెన్న, జున్ను, ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, మెంతి కూర, ఆకుపచ్చగా ఉండే కూరగాయలు తింటే చాలా మంచిది.
క్యాల్షియం ఆధారిత(Calcium Related) ఆహారాలు మీ గర్భాశయం కండరాలను నొప్పి లేకుండా నివారిస్తాయి. మెనోపాస్(Menopause) దశకు చేరుతుంటే పీరియడ్స్ సరిగా రావు ఆ సమయంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే ఈస్ట్రోజెన్(Estrogen) స్థాయి నియంత్రణ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతుంది ఫలితంగా వేడిని పుట్టి ఉష్ణం పెరుగుతుంది.
ఈ సమయం లో ముందుగా మహిళలు ప్రతి రోజు కొన్ని అవిసె గింజలు(Flax seeds) తింటే ఈ హార్మోన్ సమస్య 66 శాతం తగ్గుతుందని తెలుస్తోంది.
జింకు(Zinc) అధికంగా లభించే ఆహారం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హార్మోన్లు అసమతుల్యతకు చెక్ పెట్టొచ్చు. ఈ జింగ్ ముదురు రంగు చాక్లెట్ల(Chocolates)లోనూ, ,చికెన్, మటన్, పీతలు వంటి మాంసాహారంలోనూ, వేరుసెనగ గింజల్లోనూ దొరుకుతుంది.
వీటిలో ఏదో ఒకదాన్ని రోజూ వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపలు ఎంత తింటే అంత మంచిది. చేప(Fish)ల్లో ఒమెగా 3 ఫ్యాటీ(Omega fatty 3) ఆమ్లాలు హార్మోన్లకు మంచి చేస్తాయి. అలాగే ఆలివ్ నూనె(Olive Oil)తో చేసిన వంటకాలు తిన్నా మంచిదే.
ఈస్ట్రోజెన్(Estrogen) ఉండే సోయాబీన్స్, బఠాణీలను వారానికి రెండు మూడు సార్లయినా ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. ఇక పండ్లలో సిట్రస్(Citrus) పండ్లు తింటే చాలా మంచిది. హార్లోన్ల సమస్యతో బాధపడుతున్నరు కాఫీ(Coffee), టీ(Tea)లకు దూరంగా ఉండాలి.
మహిళలూ సమతుల ఆహారాన్ని ,సరైన వ్యాయామం ,విశ్రాంతి తో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి .