మనలో చాలా మందికి మబ్బుల్లో విహరిoచడమంటే ఇష్టమే కదూ. ఆ కోరికను ఏదైనా ప్రయాణం రీత్యా విమానాల ద్వారా తీర్చుకుంటాం. అందులో నూ మొట్ట మొదటి సారి ఎక్కే వారైతే విండో సీట్ పక్కన కూర్చుని, ధైర్యవంతులు అయితే పర్లేదు కానీ లేదంటే భయపడుతూనీ ఆ మేఘాలను చూసి ఆనందిస్తుంటారు. అయితే దూర ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఈ విమాన ప్రయాణం చాలా విసుగు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా అందులో ఉండే వినోదాత్మక అంశాలు అలాగే ఉన్నాయి. వాటిలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. అందుకే ఈ లోటును పూడ్చడానికి WindSpeed Technologies అనే సంస్థ ఒక పేటెంట్ ను ఫైల్ చేసింది. ఇది విమానాల్లో ఒక కొత్త కోణాన్ని ప్రవేశపెట్టనుంది.

అదే Skydeck. ఇది ఒక చిన్న bubble లాంటి అద్దాల ఛాంబర్ లో, విమానం పై భాగంలో కూర్చుని చుట్టూ చూడగల అవకాశాన్ని కల్పించనుంది. ఊహకే అందడం లేదు కదూ. గాల్లో విమానం ఎగురుతున్నప్పుడు, అందరి కంటే ఎత్తులో కూర్చుని ఆ మేఘాల్లోకి చూసే అవకాశం అద్భుతం కదూ. బహుశా ఈ Skydeck కు ప్రేరణ సూపర్ sonic జెట్ లు అయ్యి ఉండవచ్చు. ఒక మెట్ల దారి ద్వారా విమానం పైన ఉన్న ఈ ఛాంబర్ లో ఇద్దరికీ మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. అక్కడ కూర్చుని 360 డిగ్రీ వ్యూ మీకు లభిస్తుంది. అంటే గుండ్రంగా తిరుగుతూ మేఘాల్లో చుట్టూ చూడచ్చు. ఇందుకోసం ఈ సంస్థ ఈ ఛాంబర్ ను తయారు చేయడానికి సంవత్సర కాలంగా కసరత్తులు చేస్తోంది. కొన్ని వేల అడుగుల ఎత్తులో ఆ గ్లాస్ ఛాంబర్ UV రేడియేషన్, ఫాగ్ మరియు అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా ఈ Skydeck ను రూపొందిస్తున్నారు. అంతే కాదు ఈ Skydeck ను ఆకాశo లో ఎగిరేటప్పుడు విమానం tail కు అడ్డు కాకుండా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఈ Skydeck ను VIP లకు గానీ, ప్రయాణీకులకు pay-per-view పద్ధతి లో కానీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ వీడియో చూస్తె ఈ Skydeck కు ఎన్ని డబ్బులు చెల్లించినా తక్కువే అనిపిస్తుంది.

Source