చలికాలం(Winter Season) వచ్చేసింది, అన్ని వేడి వేడి ఆహార(Food) పదార్ధాలు తినాలనిపిస్తుంది. చలికి వెచ్చగా రగ్గులు కప్పుకుని హాయిగా పడుకోవలనిపిస్తుంది, ఉదయం లేవాలంటే కొంత ఇబ్బందిగా కూడా కల్గుతుంది. ఈ హడావిడిలో ఆరోగ్యం(Health) గురించి మరిచిపోకూడదు. మిగిలిన అన్ని సీజన్స్ లాగానే వింటర్ లో కూడా తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి.
చలికాలంలో జీవన విధానం(Life Style)లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కోల్డ్ వెదర్(Cold Weather) ని తట్టుకోవడానికి బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది. శీతాకాలంలో ముఖ్యంగా జాగ్రత్త(Precautions) పడవలసినది హైడ్రేషన్(Hydration) విషయంలో. ఈ హైడ్రేషన్ నీటి వల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల లభిస్తుంది. వింటర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం!
- వేడి వేడి సూప్స్(Soups) ఈ కాలం లో చాలా మంచివి. ఈ సూప్స్ కూడా ఇంట్లో తయారు చేసినవి అయితే ఇంకా హెల్దీ అన్న విషయం మీకూ తెలిసిందే. ఈ సూప్స్ ని కూడా రూమ్ టెంపరేచర్ లో తాగితేనే మంచిది.
- ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళ(Warm Water)ను త్రాగాలి. రోజు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనేతో శరీరాన్ని మసాజ్ చేసుకుని ఓ గంట తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి.
- స్ట్రాబెర్రీస్(Straw berries), ఆరెంజెస్(Oranges), పైనాపిల్(Pineapple) వంటి ఫ్రూట్స్ లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో మార్కెట్ లో ఈ పండ్లు దొరుకుతాయి.
- ఆల్కహాల్(Alcohol), కెఫీన్(Caffeine) తీసుకోవడం బాగా తగ్గించండి. ఈ సమయంలో వేడి వేడి టీ, కాఫీ తాగకుండా ఉండడం కష్టం కానీ తప్పదు మరి. వీటిని ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి. వీటిని తీసుకునేటప్పుడు ఇవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి అన్న విషయం గుర్తు పెట్టుకుంటే తర్వాత వీటి మీదకి అంత తొందరగా మనసు పోదు.
- అలాగే, తాగే నీళ్ల మోతాదు, తినే ఆహారం లాంటి వాటిలో తెలియకుండానే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వాడే సబ్బులు, క్రీములు, షాంపూలతో పాటు వేసుకునే దుస్తుల విషయంలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవడం అవసరం.
- చలికాలం చర్మ సంరక్షణ(Skin Protection) దాదాపు మన చేతుల్లో ఉన్నదే. సమస్య జఠిలమైనప్పుడు చేతికి దొరికిన స్టెరాయిడ్ క్రీములు(Steroid Creams) రాసి కొత్త సమస్యలు తెచ్చుకోకండి. నిపుణుల సలహా తీసుకోండి. హేమంత శరదృతువుల్ని ఆస్వాదించండి.