Fridge (ఫ్రిడ్జ్). ఇది ఆహార పదార్ధాలను పాడవకుండా నిల్వ ఉంచగల సాధనం. ఇది ఇప్పుడు ఎంతో అవసరమైన వస్తువు. ఇది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని కోట్ల మందికి అందుబాటులో ఉంది. మరి అభివృద్ధి చెందని దేశాల పరిస్థితి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఈ ఫ్రిడ్జ్ కూడా విలాసవంతమైన వస్తువనే చెప్పాలి. ఈ సాధనం లేక ఆహారాన్ని నిల్వ చేయలేక కొన్ని కోట్లు నష్టపోతున్నారు. ఈ సమస్యను ఒక సవాలుగా తీసుకొని కెనడాలోని University of Calgary కి చెందిన విద్యార్ధులు ఈ రెఫ్రిజిరేటర్ కు ప్రత్యామ్న్యాయంగా “Wind Chill” అనే సాధనాన్ని తయారు చేసారు. ఇది ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు విద్యుత్తును వాడుకోకపోవడం దీని ప్రత్యేకత. అంతే కాదు ఇది Biomimicry Global Design Challenge 2015 లో మొదటి బహుమతి స్థానాన్ని గెలుచుకుంది. ఇక దీని పని తీరును పరిశీలిద్దాం.
ఈ Wind Chill యూనిట్ లో 5 భాగాలుంటాయి. అవి రెఫ్రిజిరేటర్ ఛాంబర్, funnel, underground piping, evaporation chamber, సోలార్ ఫ్యాన్. ఈ రెఫ్రిజిరేటర్ ఛాంబర్ అడుగు భాగాన్ని భూమిలో ఉండేట్టు పాతి పెట్టాలి. దీనిలోని funnel పర్యావరణం లోని వేడి గాలిని లాక్కొని underground piping ద్వారా evaporation chamber లోని coiled copper pipe లోకి చేరుతుంది. ఇలా underground piping ద్వారా బయట కంటే ఉష్ణోగ్రత తగ్గడం మొదలవుతుంది. ఇక ఈ ఛాంబర్ లో ఈ copper పైప్స్ నీటిలో మునిగి ఉంటాయి. సూర్యుని ద్వారా పైన మూత లేని ఈ గాజు పెట్టె (evaporation chamber) లోని నీరు ఆవిరైపోయే కొద్దీ ఈ పైప్లలోని గాలి ఉష్ణోగ్రత మరింత తగ్గుతుంది. దీనిని evaporative cooling effect అంటారు. అంటే వేడికి మన ఒంటి మీద చెమట ఆవిరైపోయి మన శరీర ఉష్ణోగ్రత తగ్గి చల్లగా అనిపించడాన్నే దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. ఇక మళ్ళీ అక్కడి నుంచి భూమి లోపల అమర్చబడిన పైప్‌ల ద్వారా గాలి మళ్ళీ రెఫ్రిజిరేటర్ ఛాంబర్ లోకి ప్రవేశిoచేటప్పుడు ఒక సోలార్ ఫ్యాన్ ద్వారా మరింత chilled air ఈ రెఫ్రిజిరేటర్ ఛాంబర్ లోకి వస్తుంది. ఆ విధంగా విద్యుత్ అవసరం లేకుండానే ఈ wind chill యూనిట్ ద్వారా ఆహారాన్ని నిల్వ చేయచ్చు. అయితే ఈ wind chill యూనిట్ లో, సాధారణ రెఫ్రిజిరేటర్లలో ఉండే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తెచ్చేందుకు మరింత ప్రయత్నం చేస్తున్నామనీ ఈ విద్యార్ధులు పేర్కొన్నారు.
వీరిని చూస్తే ప్రకృతి మానవుడికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుoది అనడంలో సందేహం లేదు కదూ.