బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) వీకెండ్ రానే వచ్చేసింది. వీకెండ్ వస్తే హౌస్ మేట్స్ లో ఫుల్ జోష్ వస్తుంది. నాగ్ సారని కలవచ్చు, ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ లో ఒకరు ఎలిమినేట్ అవ్వుతారు.
ఈ వారం నామినేషన్(Nomination) లో ఎనిమిది మంది వున్నారు. నిన్నటి (శనివారం) ఎపిసోడ్ లో నలుగురు సేఫ్ అయ్యారు.
వారం లో హౌస్ మేట్స్(House mates) మధ్య జరిగే రచ్చకు నాగ్ క్లాస్ ఇచ్చేది వీకెండ్స్ లోనే మరి ఎవరి మీద నాగ్ సీరియస్ అయ్యారు శనివారం(ఆక్టోబర్ 02) ఎపిసోఎడ్ వివరాలు చూసేద్దాం .
వీకెండ్ లో ఏదో ఒక పాటకు స్టెప్స్‌ను వేసి ఎంట్రీ ఇచ్చే నాగ్, అక్టోబర్ 02 న గాంధీ జయంతి సందర్భంగా మంచి సాంగ్ తో గాంధీజీ కి నివాళ్లు అర్పించారు.
ఆ తరువాత బిగ్ బాస్(Big bos) హౌస్ లోని శుక్రవారం ఏం జరిగిందో టీవీ లో చూసారు.
జెస్సీ తో బాగానే ఉంటున్నాడు నన్నే దూరం పెడుతున్నాడు షన్ను, ఇదో పంచాయతీ అయిపోతోంది అంటూ కాజల్ దగ్గర తన బాధని వెల్లబుచ్చుకుంటుంది సిరి.
ఇప్పుడు వస్తాడు కదా కడిగెయ్ , నిలదీసేయ్ ఎందుకిలా మాట మాట కి చేస్తున్నావ్ అని సలహా ఇస్తుంది కాజల్. నాకు స్పేస్ కావాలి అంటున్నాడు అంటుంది సిరి.
ఇక జైలు లో వున్న జెస్సీ విడుదల చేయమని కెప్టెన్ శ్రీరామ్ ని ఆదేశిస్తాడు బిగ్ బాస్. మరో పక్క నాతో మాట్లాడడం లేద్దని ఏడుస్తూ కాజల్ దగ్గర సీన్ చేస్తుంది.
తరువాత బిగ్ బాస్(Big boss) ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇస్తాడు.
తెనాలి డబల్ హార్స్ ప్రొడక్ట్స్ తో హౌస్ మేట్స్ అందరు వివిధ పప్పులతో కలసి దోస, సాంబార్, పొంగల్ లాంటి ఫుడ్ ఐటమ్స్ చేయాల్సి ఉంటుంది.
అలాగే హౌస్ మేట్స్(House mates) స్వీట్ మెమోరీస్ ని కూడా షేర్ చేసుకున్నారు. ఈ టాస్క్ లో కూడా షన్ను పక్కనే కూర్చున్న సిరి. తనని ఎందుకు దూరం పెడుతున్నావ్ అని అడగడంతో షణ్ముఖ్ ఓపెన్ అయ్యాడు.
‘మెంటలీ.. నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నన్ను వాడుకుంటున్నారేమో అని ఫీలింగ్ వస్తుంది.
నాకు జెస్సీ మధ్య బాండింగ్ వేరు. వాడు నన్ను వాడుకున్నా ఆ ఫీలింగ్ (Feeling) ఏమీ రాదు.. కానీ నీ విషయంలో అలా కాదు.. నువ్వు నన్ను వాడుకుంటున్నావేమో అని అనిపిస్తుందని కరాఖండి గా చెప్పేసాడు షణ్ముఖ్.
అయితే సిరి మాత్రం.. నిన్ను వాడుకుంటున్నారని అనుకోవడం నీ అభిప్రాయం అదేమీ తప్పు కాదు, పక్కనే ఉంటే ఎమోషనల్ బాండ్ ఏర్పడి గేమ్‌పై ఇన్ఫ్లుయెన్స్ అవుతుందేమో అని అనుకుంటున్నావా ? నా దగ్గర నీ ప్రశ్నలకు ఆన్సర్ ఉంది కానీ.. చెప్పాలని అనుకోవడం లేదు.. చెప్పను.. టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావ్ అంటుంది సిరి .
ఇక అంతేనా ఏమైనా ఉందా? అని సిరి అడగ్గా.. ఏం లేదు అని అనేశాడు షణ్ముఖ్.
హౌస్‌లో హ్యాపినెస్ లేదు జాయ్ లేదు.. కొంతమంది చేసే పొరపాట్లు వల్ల హౌస్ కంట్రోల్ తప్పింది.. మీకు 15 సెకన్ల టైం ఇస్తున్నా తప్పు చేసిన వాళ్లు నిలబడండి.. అని నాగార్జున అనగా.. ఇంట్లో ఉన్న వాళ్లు ఎవరూ లేవలేదు.
దీంతో గత వారం రోజులుగా ఎవరూ ఏ తప్పూ చేయలేదా? అని అడగ్గా జెస్సీ లేచి నిలబడ్డాడు. ‘నువ్వు ఏం తప్పు చేశావ్ జెస్సీ.. అని అడగ్గా కెప్టెన్(Captain)గా ఫెయిల్ అయ్యా అని ఒప్పుకున్నాడు.
నీకు ప్రతి దానికి త్యాగం చేయడం అలవాటు అయిపోయింది.. చేసిన తప్పుకుని శిక్ష వేశారుగా.. కెప్టెన్ పోటీదారుడు కాలేకపోయావు.. జైలుకి కూడా పంపారు. నీకు తెలియడం లేదు కానీ.. నిన్ను తొక్కేస్తున్నారు అని అన్నారు నాగ్.
తన తప్పు లేకుండానే తప్పని ఒప్పుకున్నా జెస్సీ.. కానీ తప్పుచేసిన వాళ్లు మాత్రం తప్పుని ఒప్పుకోవడం లేదు.. ఇంకో ఐదు సెకన్ల టైం ఇస్తున్నా తప్పు ఎవరు చేశారో చెప్పాలి అని అన్నడం తో శ్వేతా నిలబడి ‘నేను జెస్సీని వరస్ట్ పెర్ఫామర్ అని తప్పు చేశా.. అని చెప్పింది.. జెస్సీ వరస్ట్ కాదని ఇప్పుడు చెప్తున్నావ్ సరే.. మరి వరస్ట్ పెర్ఫామర్ ఎవరు అని అడగ్గా.. లోబో పేరు చెప్పింది.
ఎందుకు అని అంటే.. ‘ప్రియపై అరవడమే కాకుండా.. తినొద్దని బిగ్ బాస్(Big boss) చెప్పిన వినకుండా తినేసి.. జెస్సీకి పనిష్మెంట్ వచ్చేట్టు చేశాడు’ అని చెప్పింది.
దీంతో నాగార్జున లోబోని, అడగ్గా.. ‘నా వరకూ నేను కరెక్ట్ చేశా బరాబర్ చేశా జనానికి ఏం నచ్చుతుందో నచ్చదో తెలియదు అని అన్నాడు.
నా ప్రేమ గురించి హర్ట్ అయ్యేట్టు మాట్లాడింది. అందుకే అరిచా అని చెప్పాడు లోబో. నీ ఒక్కడికే ఉందా ప్రేమా?? అంత రావాల్సిన అవసరం ఏముంది అని అడగ్గా.. నేనేం అరవలేదు అని అన్నాడు లోబో.
దీంతో నాగార్జున కోపం వచ్చింది సరే వీడియో చూద్దాం అని వీడియో ప్లే చేసారు. ఐడోన్ట్ కేర్ జనాలు అని నువ్వే అంటావు. జనం వల్లే నేను ఇక్కడికి వచ్చానని అంటావు. ఏం అనుకోవాలి నీ గురించి.. మాట్లాడితే బస్తీ బస్తీ అంటావు..
మా మనస్తత్వం వేరు విల్లా మనస్తత్వం వేరే అంటావు. ఇది బిగ్ బాస్ హౌస్ (Bigboss House)అంతా ఒక్కటే, నీ బస్తీ కార్డ్ గురించి మాట్లడాకు ఒక్కసారి ఆ రోజు ఎలా అరిచావో చూపించు అని అన్నారు. దాంతో గుర్తులేదు అని, ఇంకోసారి ఇలా చేయను అని అంటాడు లోబో.
గెలవాలంటే తగ్గాలే
నాలుగో వారం ‘గెలవాలంటే తగ్గాలే’ టాస్క్‌లో వెయిట్ లాస్ (Weight loss) అయిన హౌస్ మేట్స్ కి రివార్డ్‌లు ప్రకటిస్తూ వారు కోల్పోయిన వెయిట్ లాస్కి తగ్గట్టుగా చాకోలెట్స్ (Chocolates) అందించారు నాగ్ (Nag) .
అయితే ఆ ఆటల లీస్ట్ లో ఉన్న సిరి-షణ్ముఖ్‌ల (Shanmukh) కు చురకలేస్తూ మిరపకాయ రుచిచూపారు. కూర్చుని కబుర్లు చెప్పడం తప్పితే నీలోవున్న ఫైర్ బయటకు రావడంలేదని షణ్ణూకి కౌంటర్ ఇచ్చారు.
అతని ఆట అతన్ని ఆడనివ్వి సిరీ (Siri) అంటూ క్లాస్ పీకారు.
ఫస్ట్ రౌండ్లో యాంకర్ రవి సేఫ్(safe) కాగా.. ఆ తరువాత సన్నీ.. ప్రియ, కాజల్ లు సేవ్ అయ్యారు.
ఇక నామినేషన్(Nomination) లో, నటరాజ్ మాస్టర్, లోబో, ఆనీ మాస్టర్, సిరి వున్నారు.
ఈ నలుగురిలో ఒకరు ఆదివారం నాడు ఎలిమినేట్(eliminate) కాబోతున్నారు…ఎవరో చూడాల్సిందే మరి …