దీపావళి(Diwali) వచ్చిందంటే అందరు తెల్లటి దుస్తులు ధరించి ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మి పూజ చేసి, బాణాసంచా(Crackers) కాలుస్తుంటారు. మరి అసలు దీపావళి అంటే ఏంటి? దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం? అనే విషయాలను తెలుసుకుందాం!
మన భారతీయ(Indian) ఆధ్యాత్మిక ప్రపంచం(Spiritual world)లో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మన జాతి(Race),సంస్కృతి(Culture)కి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఆనందోత్సహాలతో చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండగే దివ్యదీప్తుల దీపావళి. చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారనేది పురాణం ప్రాశస్త్యం.
దీపావళి పండుగ అనగానే మనం తెలీకుండానే చిన్న తనంలోకి వెళ్ళిపోతాం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల(5 days) పండుగ(Festival)గా జరుపుకుంటారు. ఆశ్వయుజ(Aswayuja) బహుళ త్రయోదశి(Trayodasi) తో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక(Karthika) శుద్ధ విదియ(Vidiya), భగినీ హస్త(Bhagini hastha) భోజనంతో ముగుస్తాయి.
దీపావళి పండుగనే దీపోత్సవం(Deeposthavam) అని కూడా అంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. అజ్ఞానం(Ignorance) అనే చీకటిని పాలద్రోలడానికి జ్ఞానం(Knowledge) అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం.దీపావళి రోజు చెడు నశించిన రోజు.
ధర్మసంస్థానంతో జగత్తులో వెలుగు నిండిన రోజు. దీపం అంటే త్రిమూర్తి స్వరూపం. దీపం లో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని ఎర్రని కాంతి బ్రహ్మ దేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకు, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. దీపావళి రోజు వెలిగించే ప్రతి దీపానికి కూడా మూడు వత్తులు తప్పకుండ ఉండాలి. ఎందుకంటే ముల్లోకాలలోని అంధకారాన్ని పాలద్రోలి మన ఇల్లు లక్ష్మి దేవి(Lakshmi devi Puja) ఇల్లుగా అవుతుంది.అయితే మనం వెలిగించే దీపాన్ని ఆవు నేతితో కానీ నువ్వుల నూనె తో కానీ భక్తిగా వెలిగించాలి. ఇంత గొప్పగా జరుపుకునే దీపావళి పండుగకి కొన్ని పురాణం కథలు వున్నాయి.
బ్రహ్మ దేవుని నుంచి పొందిన వార గర్వంతో నరకాసురుడు(Narakasura) దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. అప్పుడు సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి అని చెబుతారు. రావణాసురు(Ravanasura)నితో జరిపిన యుద్ధం(WAR)లో విజయం చెందిన శ్రీరామ చెంద్రు(Lord Rama)డు సతీసమేతంగా అయోధ్య(Ayodya)కు విచ్చేస్తాడు.
ఆ రోజు అమావాస్య అయోధ్యాంత చీకటితో నిండి ఉంటుంది. దాంతో శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య వాసులు దీపాలు వెలిగించి, అమావాస్య చీకట్లను పాలద్రోలుతారు. ఆ నాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాము. అని ఒక కదా వెలుగులో వుంది. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మి దేవి ఉద్భవించింది.
అందుకే సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మి దేవికి దీపావళి నాడు సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌవురువులు(Kauvravas)తో మాయాజూదంలో ఓడిన(Defeated) పాండవులు(Pandavas) పదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఈ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికీ స్వాగతం పలికారని మరో పురాణం కథ మనకు తెలియజేస్తోంది. మనలోని చీకటిని పాలద్రోలి జీవితం లో వెలుగుని నింపుకునేందుకు చిహ్నంగా జరుపుకునే ఒక గొప్ప పండుగా దీపావళి.
దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
దీపావళి నాడు అబాల గోపాలం కొత్త బట్టలు ధరించి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈరోజున ఘుమఘుమలాడే పిండి వంటలు(Tasty dishes) చేస్తారు. ప్రతి ఏటా దీపావళిని ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి అక్టోబరు 24(October 24th), సోమవారం నాడు వస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్టోబరు 25న జరుపుకోనున్నారు. ఈ పండుగకు మందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశి(Narakachthurdasi) చేసుకుంటారు. ఈ దీపావళి పండుగకే దీపాల పండుగ, దివ్వెల పండుగ అనే పేర్లు ఉన్నాయి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం అనవాయితీ. దీపావళి నాడు లక్ష్మీ పూజ సాయంత్రం 5.39 గంటలకు ప్రారంభమై…సాయంత్రం 6.51 గంటలకు ముగుస్తుంది.