మెటా(Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్(Instant Messaging) ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్‌ల(New Features)తో యూజర్ల(Users)ను ఆకట్టుకుంటోంది. ఇదే జోష్‌లో వాట్సాప్(Whatsapp) మరో అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్దమవుతోంది.

వాట్సాప్ వీడియో కాల్స్(Video Calls) మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌ తీసుకురానుంది. యూజర్ మరొక యాప్‌ ఉపయోగిస్తున్నప్పటికీ.. ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇది యూజర్లను సులభంగా మల్టీ టాస్కింగ్(Multi Tasking) చేయడానికి అనుమతిస్తుంది.

ఐఫోన్‌ యూజర్‌లకు మాత్రమే

వాట్సాప్ వీడియో కాల్స్‌ కు ఇండియా(India)లో మంచి ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వీడియో కాల్ యూజర్‌లలో భారత్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా యూజర్లు అన్ని రకాల డివైజెస్‌(Devices) లో సులభంగా, తక్కువ డేటా వినియోగంతో వీడియో కాల్‌లను ఆస్వాదించవచ్చు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌(Picture-in Picture Mode)తో వీడియో కాలింగ్‌కు మరింత ఆదరణ పెరగనుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఆండ్రాయిడ్(Android) యూజర్లకు సైతం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్‌లో లాంచ్‌ చేశారు. సెలక్టెడ్‌ యూజర్లు ఈ ఫీచర్‌ను ఎక్స్‌పీరియన్స్‌(Experience) చేయవచ్చు.

 వీడియో కాల్‌ మాట్లాడుతూ, మరో యాప్‌ వినియోగించవచ్చు

WABetaInfo నివేదిక ప్రకారం వీడియో కాల్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ద్వారా యూజర్లు భిన్నమైన అనుభూతిని పొందుతారని కంపెనీ చెబుతోంది.  వాట్సాప్ అకౌంట్లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్(Enable) చేస్తే వీడియో కాల్ సమయంలో మరొక యాప్‌ను సైతం యూజ్ చేయవచ్చు.

ఇది పిక్చర్ ఇన్ పిక్చర్ వ్యూలో కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు WABetaInfo పేర్కొంది. వాట్సాప్ మరో సరికొత్త ఆప్షన్‌ సైతం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మెసేజ్ డిసప్పియరింగ్‌ షార్ట్‌ కట్‌(Disappearing Shortcut) ఆప్షన్‌ను సిద్దం చేస్తోంది. ఇది కూడా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది.

వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్డేట్లో మెసేజ్ డిజప్పియర్ చేసే షార్ట్‌ కట్‌ ఫీచర్‌ను రీడిజైన్(Redesign) చేస్తోంది. ఈ ఫీచర్‌తో కొత్త, పాత చాట్స్‌ను డిసప్పియర్‌ థ్రెడ్‌గా గుర్తించడం ఈజీ అవుతుంది.

ఫ్లోటింగ్ విండోలో వాట్సాప్ వీడియో కాల్స్

ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ కొత్తదేమీ కాదు. మెసెంజర్(Messenger), యూట్యూబ్(Youtube) వంటి యాప్స్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తన్నాయి.

ఫ్లోటింగ్ విండోల(Floating Windows) ద్వారా మెసెంజర్ కాల్స్ చేస్తూనే యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు. మరోవైపు, వాట్సాప్ ఇటీవలే మెసేజ్ యువర్ సెల్ఫ్(Message Your Self) అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇది యూజర్ల నోట్స్ డౌన్‌లో ఉంచుకోవడానికి లేదా చాట్‌ల రూపంలో రిమైండర్ల(Reminders)ను గుర్తు చేయడానికి చాట్ విండో(Chat Window)ను అందిస్తుంది.