మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ద్రవపదార్థం రక్తం. రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి,కాబట్టి రక్త ప్రసరణ(Blood circulation) వ్యవస్థ, ఆరోగ్యం గురించి అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
మరి రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
రక్త ప్రసరణ(Blood circulation) వ్యవస్థలో ఏ మాత్రం తేడా వచ్చిన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనలని చుట్టూ ముడుతాయి.రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం ప్రసరించటం వల్ల జీవ క్రియ(Digestive system)లు పనిచేయడానికి, అవయవాలకు అవసరమయే న్యూట్రిషన్స్ మరియు విటమిన్స్ అందిస్తుంది.
హార్మోన్ల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రత(Body Temperature)లు క్రమబద్దం చేయడానికి రక్త ప్రసరణ ఎంతో అవసరం. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే , ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది.
రక్త ప్రసరణ బలహీనంగా వున్నాడన్న విషయాన్నీ ప్రారంభం లో గుర్తించినట్లయితే వెంటనే చికిత్సను అందించవచ్చు.
రక్త నాళ్లలో ఫలకం ఏర్పడం వల్ల మరియు ఇతర కారణాల వల్ల రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో గుండె కి, చేతులకు, కాళ్ళకు మరియు శరీరంలోని మరి కొన్ని ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది.
సరైన రక్త ప్రసరణ(Blood Circulation) శరీర ఉష్ణోగ్రతను ఇవ్వడానికి సహాయపడుతుంది. అందువల్ల బలహీనమైన రక్త ప్రసరణ వాచనియ్య స్థాయి నుండి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి కారణమవుతుంది. అంతే కాదు బలహీనమైన రక్త ప్రసరణ వల్ల కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది.
దాంతో పాదాలు, చేతులు వాపులకు కారణమవుతుంది. బలహీనమైన రక్త ప్రసరణ వల్ల శరీరం అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సరఫరా అవుతాయి. అందువల్ల అలసిపోయినట్లుగా అనుభూతి కలుగుతుంది.
మెదడు పనితీరు చురుకుగా ఉండాలంటే రక్త ప్రసరణ మెరుగ్గా ఉండాలి. రక్త ప్రసరణ(Blood circulation) లేనట్లయితే అలసటకు గురిచేస్తుంది. ఏకాగ్రత ఉండదు మరియు మతిమరువు వంటి లక్షణాలు ఎదురుకోవాల్సి వస్తుంది.
శరీరం మొత్తం సరిగా రక్త ప్రసరణ జరగకపోతే జీవక్రియల్లో మార్పులు చేసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి(Immunity power) తగ్గిపోతుంది. దాంతో వివిధ రకాల వ్యాధులు చుట్టూ ముడుతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి(life style) ద్వారా రక్త ప్రసరణను సవ్యంగా వుంచుకోవచ్చును. తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కొలెస్ట్రాల్(cholestrol) తీసుకోవడం. పీచు(Fibre) పదార్థాలు తీసుకోవడం, క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచే సహజ సిద్దమైన ఆహారం తీసుకోవటం ద్వారా ఈ సమస్యను నిర్ములించవచ్చు.
రక్త ప్రసరణ(Blood circulation) లో సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి, ఒత్తిడికి గురైన వ్యక్తిలో రక్త ప్రసరణ కొన్ని ప్రధాన అవయవాల వద్దే నిలిచిపోతుంది. మిగతా భాగాలకు చేరదు. చేతులు, మరియు కాళ్ళకు రక్త ప్రసరణ సమస్యలు తలెత్తుతాయి.
అందువల్ల రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే ఒత్తిడిని అధిగమించాలి, లోతైన శ్వాస ప్రక్రియను పాటించడం మరియు ప్రతి రోజు ధ్యానం(Mediatation) చేయడం ద్వారా రక్త ప్రసరణ లో ఉన్న సమస్యలని అధిగమించవచ్చు.
రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది. కాబట్టి రక్త ప్రసరణ స్థితిగతులు తెలుసుకోవడం చాలా అవసరం.
రక్త ప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే వెంటనే మెరుగైన చికిత్సను అందించవచ్చు…
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు …. మీ శరీరం లో రక్త ప్రసరణ విషయం లో జాగ్రత్త గా ఉండి, ఆరోగ్యం గా ఉంటారు కదూ ..