సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు.
పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు.
ఆయనే జీసస్(Jesus). క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడ్డాడు. యేసు క్రీస్తు మరణిస్తే శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నాము ..? అసలు శుభం ఎలా అవుతుంది..? అసలు గుడ్ఫ్రైడ్ చరిత్ర, ప్రాముఖ్యత, ఈరోజు క్రైస్తవులు ఏమి చేస్తారనే విషయాల గురించి తెలుసుకుందాం
ఏసుక్రీస్తును శిలువ వేసిన జ్ఞాపకార్థంగా క్రైస్తవులు గుడ్ఫ్రైడేను జరుపుకుంటారు. కాబట్టి వారంతా ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.. గుడ్ ఫ్రైడేను చాలా మంది పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. ఏసుక్రీస్తును శిలువ వేసినందుకు గానూ, జ్ఞాపకార్థంగా గుడ్ఫ్రైడేను నిర్వహిస్తారు.
ఏసుక్రీస్తును శిలువ వేసిన జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తం(worldwide)గా క్రైస్తవులు(Christians) జరిపే.. మతపరమైన సెలవుదినం. ఈ రోజున ప్రజలు క్రీస్తు మరణం నిమిత్తం చర్చికి వెళ్లి సంతాపం వ్యక్తం చేస్తారు. అందుకే దీనిని హోలీ ఫ్రైడే(Holy Friday) లేదా బ్లాక్ ఫ్రైడే(Black Friday) అని కూడా పిలుస్తారు.
యేసుక్రీస్తు పునరుత్థానం లేదా ఆయన తిరిగి లేచారని నమ్ముతూ.. క్రైస్తవులు నిర్వహించే ఈస్టర్ ఆదివారాని(Easter Sunday) కి కేవలం రెండు రోజుల ముందు గుడ్ ఫ్రైడే వస్తుంది. మాండీ గురువారం తర్వాత ఈ ఫ్రైడే వస్తుంది. ఇది ఈస్టర్కు ముందు వచ్చే గురువారం, ఏసుక్రీస్తు చివరిసారిగా చేసిన విందును గుర్తుచేస్తుంది.
ఇవి సంతాప దినాలు(లెంట్ డేస్) కావడంతో.. క్రైస్తవులు వేడుకలు, ప్రత్యేక విందులు చేసుకోరు. చాలా మంది కఠినమైన ఉపవాసాలు(Fasting) చేస్తారు. మాంసాన్ని ముట్టరు. ఈ పవిత్రమైన రోజున క్రీస్తును స్మరించుకోవడానికి అందరూ చర్చికి వెళ్తారు. పాస్టర్ సందేశం అందిస్తారు.
ఏసుక్రీస్తును శిలువ వేసిన కారణాలను స్మరించుకుంటారు. ముప్పై వెండి నాణేల కోసం జుడాస్ ఏసును ఎలా మోసం చేశాడు. ఏసుక్రీస్తును క్రూరంగా ఎలా శిలువ వేశారు అనే కథను వివరిస్తారు. అనంతరం దేవుడిని తలచుకుంటూ వివిధ కీర్తనలు పాడతారు. క్రైస్తవ మతంలోని కొన్ని తెగలు గుడ్ ఫ్రైడేను సంతోషకరమైన రోజుగా కూడా చూస్తారు.
ఎందుకంటే ఏసు శిలువలో తన రక్తంతో.. తమను పాపలనుంచి రక్షించాడని వారు నమ్ముతారు. కొందరు తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి క్యాండిల్స్(Candles) వెలిగించి సంతాపం వ్యక్తంచేస్తారు.
గుడ్ ఫ్రైడే రోజున చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు మరణానికి ప్రతీకగా శిలువలు, ఛాయాచిత్రాలు, విగ్రహాలపై నల్లని వస్త్రాన్ని కప్పుతారు.