నిత్య యవ్వనం(Young)తో మెరవాలంటే విటమిన్ ఈ(Vitamin E) అవసరం. ప్రతి రోజు దాదాపు 15 మీ.గ్రాల విటమిన్ ఈ తీసుకుంటేనే మంచిది. అందుకోసం అప్పుడప్పుడు సన్ ఫ్లవర్ విత్తనాలను తీసుకోవాలి.

వీటిలో దొరికినంత విటమిన్ ఈ మరెందులోను దొరకదు. అలాగే విటమిన్  ఈ అధికంగా దొరికే బాదాం పప్పును రోజు తినటం వల్ల యవ్వనంతో పాటు వచ్చే యజినింగ్ సమస్యల(Aging Problems) ని దూరం చేసుకోవచ్చు.

ఇంకా ఈ విటమిన్ ఈ ఏయే ఆహార పదార్దా(Food Products)ల్లో దొరుకుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా జీవించడానికి విటమిన్లు ఎంతో అవసరం. మన శరీరంలో ఈ విటమిన్లు లోపిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది. మన శరీరంలో జరిగే పలు జీవ క్రియల్లో విటమిన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి.

ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి అవసరమైన విటమిన్లు చేరుతాయి.వాటిలో విటమిన్ ఈ ఎంతో కీలకమైనది, ఇది కొవ్వు(Fat)లొ కరిగే విటమిన్ కొవ్వులొ సరిగా జీర్ణం కానప్పుడు వారికి విటమిన్ ఈ లోపాలు రావచ్చు. దాంతో గర్భ స్రావం(Abort),ప్రసవం ముందుగానే కావడం(Early Delivery), బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం,నరాల సమస్యలు లాంటివి రావచ్చు.అందానికి(Beauty), ఆరోగ్యానికి(Healthy), సంతానం పొందడంలో విటమిన్ ఈ ముఖ్య పాత్ర(Key Role) పోషిస్తుంది.

దీని వల్ల శరీరం పటుత్వం పెరుగుతుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.యాంటీ యాక్సిడెంట్ గా పనిచేసే విటమిన్ ‘ఈ’ మన శరీరంలోని ప్రీ రాడికల్స్ ను మరియు కాన్సర్(Cancer) కారకాలను నిర్ములిస్తుంది.గుండె(Heart) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రక్త నాళ్లలా(Blood Cells) సాగే గుణాలను పెంచి అవసరమైన పరిస్థితుల్లో రక్తం సాఫీగా ప్రవహించడానికి సహాయపడుతుంది. కంటి చూపు(Eye)ను మెరుగు పరిచేందుకు, రక్త కణాల(Blood cells) వృద్ధికి దోడ్పడతాయి. అధిక బరువు(Obesity) సమస్యతో బాధపతున్న వారికి విటమిన్ ఈ వల్ల కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. పద్నాలుగేళ్లు పై పడిన వారికి రోజుకు 15 మిల్లి గ్రాముల విటమిన్ ఈ అవసరం.

పలు ఇచ్చే తల్లులు 19 మీ.గ్రాల విటమిన్ ఈ తీసుకోవాలి. అయితే ఈ విటమిన్లను అధికంగా తీసుకుంటే అనేక సమస్యలు తప్పవు కాబట్టి రోజుకు వెయ్యి మిల్లి గ్రాముల(1000mg)కు మించి తీసుకోకూడదని పోషకార నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఈ(Vitamin E) మనకు ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స(Green Leafy Vegetables), నట్స్(Nuts), ఆలివ్ ఆయిల్(Olive Oil), చేపలు(Fish). సన్ ఫ్లవర్ సీడ్స్(Sunflower Seeds), బాదాం పప్పు(Badam ),పాలకూర(Lettuce), అవకాడోల(Avocado)లో లభిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్ ను తరచూ వైద్యుల సలహా ప్రకారం తీసుకుంటే తెంనో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.   అదే విధంగా  అవకాడో తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వాపులను తగ్గించే యాంటీ ఇంఫలమేటరీ గుణాలు వీటిలో వున్నాయి. అంతేకాకుండా విటమిన్ ఈ అధికం గ వుండే బాదాం పప్పు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol) స్థాయిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు(Heart Issue) రాకుండా చూస్తుంది.

రక్త సరఫరా(Blood Circulation)ను మెరుగు పరుస్తుంది. బిపీ(BP)ని నియంత్రణ(Control)లో ఉంచుతుంది. విటమిన్ ఈ వుండే  పాలకూర(Lettuce) హై బిపీ(High BP)ని  తగ్గిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుంది. మన శరీరంలో వెలువడే హానికరమైన ప్రీ రాడికల్స్ ను నాశనం చేసే యాంటీ యాక్సిడెంట్(Anti-Oxidant) గుణాలు ఏవిటమిన్ ఈ లో  ఉండడం వల్ల అవి జీవ క్రియ(Digestive System)ల్లో వెలువడి హానిచేసే పదార్దాలను తొలిగిస్తాయని చెప్పవచ్చు.

శరీరం జీవ క్రియలు సక్రమంగా జరిగే అనేక కార్యకలాపాలను మెటబాలిక్ ఆక్టివిటీస్ అంటారు. ఈ జీవ క్రియలు సరిగా జరగడానికి ఈ విటమిన్ దోహదపడుతుంది. పొడి చర్మం(Dry Skin) వున్నవారు విటమిన్ ఈ తీసుకుంటే చర్మం సున్నితంగా తయారవుతుంది. మధుమేహ నివారణ(Diabetes Control)లో ప్రధాన పాత్ర వహిస్తుంది. రక్తంలో ఇన్సులిన్(Insulin) స్థాయిని నియంత్రిస్తుంది.

వ్యాధి నిరోధక(Immunity) వ్యవస్థను బలోపేతం చేసి రోగాలను అదుపు చేయగల శక్తిని శరీరానికి అందించే కీలక బాధ్యత కూడా దీనిదే. పెద్దల నుంచి అప్పుడే పుట్టిన పిల్లల వరకు విటమిన్ ఈ ఎంతో అవసరం. మన శరీరానికి విటమిన్లు తప్పని సరిగా కావాలి. ఈ విటమిన్లలో ఏ ఒక్కటి లోపించిన అనేక అనారోగా సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.

కాబట్టి మిగతా విటమిన్లతో పాటు విటమిన్ ఈ ని కూడా తప్పని సరిగా తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు(Nutrionist) చెప్తున్నారు.