బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) ఆరో వారం టాస్క్ లో సంచాలకులు గా వ్యవహరిస్తున్న కాజల్, సిరి గేమ్ ని మొత్తానికి వాళ్లకు నచ్చినట్టు గా మార్చేశారు.
వాస్తవానికి టాస్క్ అంటే హౌస్ మేట్స్(House mates) మధ్య పోటీ జరుగుతుంది,కానీ ఈ టాస్క్ లో సంచాలకులు మరియు హౌస్ మేట్స్ కి మధ్య జరిగింది.
ఆట మొమొత్తాన్ని త్తని ఇద్దరు సంచలకులు కలసి పెంట చేసి పెట్టారు. దీనితో బిగ్ బాస్ టాస్క్ ని సంచలకుల పని కరెక్ట్ గా వ్యవహరించనదుకు వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చాడు.
ఇక ఈవారం ఎవరు కెప్టెన్సీ(Captaincy) పోటీదారులు గా ఎంపిక అయ్యారో ఎవరు కెప్టెన్ అయ్యారో, తెలియాలంటే నిన్నటి 40వ ఎపిసోడ్ చూడల్సిందే .
బిగ్ బాస్(Big Boss) బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో భాగంగా ఏ టీం వద్ద ఎన్ని బొమ్మలు ఉన్నాయో చెప్పాలని సంచాలకులను అడిగారు బిగ్ బాస్.
అయితే కాజల్ కిట్టి తెలివితేటలకు పోయి ముందే ఫైనల్ చేసిన బొమ్మల్ని మళ్లీ రీ చెకింగ్ చేస్తానని చెప్పింది.
ఇది ఫెయిర్ కాదు.. ఇప్పటికే మనం మనకి ఇష్టమైన వాళ్లకి ఫేవర్‌గా చేశాం అని అంటున్నారు.ఇది కరెక్ట్ కాదని చెప్పింది సిరి.
అయితే కాజల్ మాత్రం తన ఒప్పుకోలేదు తాను మళ్ళీ రీ చెకింగ్ చేసి కొన్ని బొమ్మల్ని రిజెక్ట్(Reject) చేసింది. దీంతో హౌస్ మేట్స్ కాజల్ ని తప్పు పట్టారు.
నువ్ యాక్సెప్ట్ చేసిన బొమ్మల్ని రీ చెక్ చేయడం ఏంటి?? దీనికి నేను ఒప్పుకోను అని సిరి ఖరాఖండిగా చెప్పింది. శ్వేత కూడా కాజల్ ని తప్పంటూ సిరి తో ఏకీభవించింది.
ఇక కాజల్ నేను రీ చెక్ చేస్తా అని పట్టు పట్టడంతో లోబోకి చిరెత్తుకొచ్చింది. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావ్ ఏంటి? అని అంటే రవి కూడా నీకు ఇచ్చిన పవర్స్ ని మిస్ యూజ్ చేస్తున్నావ్ అని వార్నింగ్ ఇచ్చాడు.
కానీ కాజల్ మాత్రం తగ్గలేదే లేదు అన్నారు వ్యవహరించింది.
ఏ టీం ఎన్ని బొమ్మలు తయారు చేశారో ఫైనల్ గా చెప్పమని బిగ్ బాస్(Big Boss) అడగడంతో టీం రెడ్ 17, టీం గ్రీన్ 25, టీం బ్లూ 17, టీం ఎల్లో 14 అని లెక్కలు చెప్పారు.
అంతలోనే మళ్లీ గ్రీన్ టీం నుంచి ఒక బొమ్మని రిజెక్ట్ చేసి 24 అని చెప్పింది కాజల్.
రెడ్ టీంలో ఉన్న శ్రీరామ్, ప్రియ, విశ్వలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించగా దాన్ని ఉపయోగించి మీరు కావాలనుకుంటున్న టీం నుంచి సగం బొమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్.
దీంతో ఎల్లో టీం నుంచి సగం బొమ్మల్ని రిజెక్ట్ చేశారు.
తరువాత ఈ టాస్క్ లో హౌస్ మేట్స్(House mates) బిగ్ బాస్ ఇంటి నియమాలను ఉల్లంగించడంతో వాళ్ల కి పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్ .
లోబో, శ్వేతాలు బిగ్ బాస్(Big Boss) ఇంట్లో ఉన్న పిల్లోస్ ని కట్ చేసి అందులోని కాటన్ని దొంగిలించారు. సంచాలకులు వాళ్లని కనిపెట్టలేకపోయారు.
కాబట్టి బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు గ్రీన్ టీం సభ్యలైన లోబో, శ్వేతా, రవిలను, సంచాలకులుగా ఉన్న కాజల్, సిరిలను కెప్టెన్ పోటీదారులు అనర్హులుగా ప్రకటించారు.
టాస్క్ రూల్స్ ని తమకు ఇష్టమొచ్చినట్టు ఆడాలన్న సిరి, కాజల్‌లకు మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ షాక్ కి గురిచేసింది.
దీంతో నాకు కెప్టెన్(Captain) అవ్వడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బిగ్ బాస్(Big boss) అని బతిమాలాడిన సన్నీ. తరువాత కెప్టెన్ పోటీదారులు గా రెడ్ టీం, బ్లూ టీంలను అనౌన్స్ చేశారు బిగ్ బాస్.
ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సన్నీ, ఆనీ, మానస్, శ్రీరామ్, విశ్వ, ప్రియలు పోటీ పడ్డారు.
ఈ టాస్క్ లో అందరికంటే ముందు గా విశ్వ ఎక్కువ ఇసుకను సంపాదించడంతో ఆరోవారం హౌస్ కెప్టెన్ గా విశ్వ గెలిచాడు. అయితే విశ్వ రెండోసారి బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు.
అయితే ఈవారం కూడా సన్నీ ఆశలు అన్ని నిరాశలే అయింది. ఇక విశ్వ కెప్టెన్ కావడంతో, రేషన్ మేనేజర్(Ration Manager)ని ఎంపిక చేయాలని కోరడంతో మానస్, సన్నీ, ప్రియాంకలు తాము రేషన్ మేనేజర్స్ గా ఉండటానికి రెడీ అయ్యారు.
ఈ ముగ్గురిలో ఎవరు రేషన్ మేనేజర్ అవ్వాలో మీరే తేల్చుకోవాలని చెప్పారు. అయితే వీళ్లకి కూడా ఫన్నీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో పింకీ విజేతగా గెలిచింది . ఈ టాస్క్ లో సన్నీ, విశ్వ కోరికపై కావాలనే ఓడిపోయాడు టాస్క్ ని ఫన్నీగా మార్చేసి అందరిని కాసేపు నవ్వించిన సన్నీ.
ఇక అర్ధరాత్రి కాజల్, ప్రియా. సిరి, పింకీ ముచ్చట్లు పెట్టుకున్నారు. మానస్ గురించి మాట్లాడుతూ పింకీని ఆట పట్టించారు.
ఇక శుక్రవారం ఎపిసోడ్ ని ప్రోమో (Promo) ద్వారా చూపించారు. ఈ ప్రోమోలో శ్వేతా, ప్రియా వాదించుకుంటూ కనిపిస్తారు.