స్పోర్ట్స్. క్రికెట్, హాకీ, ఫుట్బాల్ మొదలైనవి. ఇవి అంటే మనకు ఎంత వ్యామోహమో వేరే చెప్పనక్కర్లేదు. ఇక మన దేశంలో అయితే ఆటగాళ్ళను దేవుళ్ళు గా చూస్తాం. ప్రపంచవ్యాప్త పోటీలకు జరిగే సన్నాహాలు, హడావిడి అయితే మాటల్లో చెప్పలేం. ఇక ఈ క్రీడల కోసం జరిగే బెట్టింగులు, స్కాములు ఆటకు మరో కోణం. ఇటువంటి క్రీడలకు కీలకమైనది ఆటగాళ్ళ నైపుణ్యం. అందుకే ఏళ్ల తరబడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మంచి కోచ్ ల చేత వీరికి శిక్షణనిస్తారు.

 

చూసేవారికి వినోదాన్ని పంచినా అవి ఆడేటప్పుడు ఆటగాళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురౌతారు. అలాగే ఎన్నో గాయాలు అయ్యి ఆటగాడి సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తాయి. ఇక వీరికి జరిగే శాస్త్ర చికిత్సలైతే లెక్కేవుండదు. ఈ నేపధ్యం లో ఆధునిక సాంకేతికత తో అందుబాటులోకి వచ్చింది ViPerform. ఆటగాళ్ళ సామర్ధ్హ్యాన్ని మెరుగుపరచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

viPerform_sensors

ఇది ఒక చిన్న సెన్సర్ వంటి పరికరం. దీనిని ఆటగాళ్ళ కాళ్ళకు తగిలిస్తే, ఈ సెన్సర్ వారి కదలికలను ఎప్పటికప్పుడు హెచ్ డి వీడియో లో చూపించి అలా వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. తద్వారా ఆటగాళ్ళ ఆటతీరును అంచనా వేస్తుంది. అంటే ఇప్పుడు ఏ కాలి మీద ఎంత శక్తిని ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. మన కంటికి కనిపించని కదలికలను సైతం రికార్డు చేస్తుంది. అలా వచ్చిన సమాచారం ద్వారా కోచ్ లు ఆటగాళ్ళ యొక్క బలాబలాలను తెలుసుకొని దానికి అనుగుణం గా శిక్షణ నివ్వవచ్చు.

దీనిని ఇప్పటికే అమెరికాలోని ఎన్ఎఫ్ఎల్ టీంలు ఉపయోగిస్తున్నాయి. దీని ధర ఏడాదికి $8100. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞ్యనం అన్ని క్రీడలు ఆమోదించాలి. ఇవి ఆటల్లో వాడటం మొదలు పెడితే ఆటకు మరింత మెరుగులు దిద్దినట్టే.

Courtesy