కోలీవుడ్(Kollywood) లోనే కాకుండా సౌత్ ఇండియా(South India) మొత్తంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సినిమాలలో తెగింపు(తునివు), వారసుడు(వారిసు) టాప్ లిస్టు(Top List)లో నిలబడ్డాయి.ఈ సంవత్సరం సంక్రాంతి(Sankranthi) బారిలో హీరోలు విజయ్, అజిత్ లు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చారు.
ముఖ్యంగా అభిమానులు అయితే సినిమా రిలీజ్ డేట్స్(Release Date) ఖరారు అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా(Social Media)లో ఊహించిన విధంగా ఒక యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత టాక్ పరంగా అయితే ప్రేక్షకుల(Audience) నుంచి మంచి రెస్పాన్స్(Good Response) వచ్చింది. రెండు కూడా అద్భుతమైన టాక్ ని అందుకోలేకపోయింది.
కానీ బాక్స్ ఆఫీస్(Box Office) వద్ద కలెక్షన్స్(Collections) మాత్రం గట్టిగానే వచ్చాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వెనక్కి రావడంతో నిర్మాతలు(Producers) చాలా వరకు సేఫ్ అయ్యారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్స్(Crazy Updates) బయటకు వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఓటిటి(OTT)లో స్ట్రీమింగ్(Streaming) కానున్నాయి.
ముందుగా అజిత్(Ajith) తెగింపు(Thegimpu) అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 8(Feb 8th) నుంచి ఇది స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్(Netflix) అధికారికం(Officially)గా ప్రకటించింది. అయితే విజయ్(Vijay) వారసుడు(Varasudu) సినిమా ఓటిటి రిలీజ్ డేట్ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఈ సినిమా హక్కుల(Rights)ను సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 22(FEB 22)వ తేదీన ఈ సినిమా రెండు భాషల్లో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాకముందే HD క్లారిటీ ప్రింట్(HD Clarity Print) ఆన్లైన్లో లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయ్యింది.
ముందుగానే హై క్వాలిటీ(Quality) తో పైరసీ(Piracy) చేయడంతో ఒక విధంగా అమెజాన్ ప్రైమ్ కు ఇది గట్టిగా దెబ్బ చూపించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఆ విషయంలో అమెజాన్ ప్రైమ్ చిత్ర యూనిట్(Movie Unit) తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఆ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఏదైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
#Kollywood #South India #Ajith #Thunivu #Vijay #Varisu #Top List #Sankranthi #Release Date #Social Media #Audience #Good response #Box office #Collections #Crazy Updates #OTT #Streaming #Net Flix #Amazon Prime #Rights # HD Clarity Print #Movie Unit