వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఎతైన ప్రాంతాలకు వెళ్ళినపుడు మనలో కొంత మందికి తలంతా తిరుగుతునట్టు(Dizziness)గా, కళ్ళు తిరుగుతునట్టుగా ఉంటుంది.
కొంతమందికి వంతైపోతుందేమో(Vomiting sensation) అన్నట్టుగా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎతైన ప్రాంతాలు వెళ్లకపోయినా మనలో కొంత మందికి అస్తమానం తలంతా తిప్పేస్తునట్టుగా ఉంటుంది.
ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు(Doctors) వెర్టిగో(Vertigo)అని పిలుస్తుంటారు. వెర్టిగో గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం!
వెర్టిగో(Vertigo) అనేది డిజ్జీనెస్(Dizziness)ని కలుగచేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వారికి తాము తిరిగిపోతున్నట్లో, చుట్టూ ఉన్నవన్నీ తిరిగిపోతున్నట్లో ఫీలింగ్ వస్తుంది.
ఇది కళ్ళు తిరగడంలా అనిపిస్తుంది కానీ అది కాదు. వెర్టిగోకి కల కారణాల(Reasons)లో బీపీపీవీ(BPPV), ఇన్‌ఫెక్షన్ (Infection), మెనియెర్స్ డిసీజ్(Meniere’s Disease), మైగ్రైన్(Migraine) ఉంటాయి.
వెర్టిగో హెరిడిటరీ(Vertigo Hereditary)గా కూడా రావచ్చు. ఈ కండిషన్(condition)నే ఫమిలియల్ బినైన్ రికరెంట్ వెర్టిగో(Familial benign Recurrent Vertigo) అని అంటారు.
బీపీపీవీ: బినైన్ ప్యారోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో(Benign paroxysmal Positional Vertigo) అనేది వెర్టిగోకి ఉన్న కామన్ కారణాలలో ఒకటి. దీని వల్ల తాము తిరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది, ఈ ఫీలింగ్ చాలా కొద్ది సేపే ఉన్నా, చాలా ఇంటెన్స్(Intense) గా ఉంటుంది. హఠాత్తుగా తల తిప్పడం వంటి చర్యల వల్ల ఇలా జరుగుతుంది.
ఇన్‌ఫెక్షన్: వెస్టిబ్యులర్ న్యూరైటిస్(Vestibular neuritis) అనబడే వెస్టిబ్యులర్ నెర్వ్‌లో ఉండే వైరల్ ఇన్‌ఫెక్షన్(Viral Infection) వల్ల వచ్చే వెర్టిగో ఇంటెన్స్(Vertigo Intense)గా, కాన్స్టంట్(Constant)గా ఉంటుంది.
మెనియెర్స్ డిసీజ్: చెవి లోపలి భాగంలో ఫ్లూయిడ్ బిల్డప్(Fluid Buildup) అయితే చాలా గంటల పాటూ ఉండే వెర్టిగో సడన్ గా వస్తుంది.
మైగ్రైన్: మైగ్రైన్(Migraine) వల్ల వచ్చే వెర్టిగో కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకూ ఉంటుంది.
ఒత్తిడి వల్ల వెర్టిగో వస్తుందా? దానికి సమాధానం రాదు, కానీ వెర్టిగో ఉంటే ఒత్తిడి(Stress) ఆ సమస్యని తీవ్రం చేస్తుంది. అయితే, ఒత్తిడి మరీ ఎక్కువైతే స్ట్రోక్ వచ్చే అవకాశాలు వున్నాయి. దాని వల్ల కూడా వెర్టిగో వస్తుంది.
వెర్టిగో కి చికిత్స వుందా?
వెర్టిగో వచ్చిన కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్(Medicine), వెస్టిబ్యులర్(Vestibular) రీహాబిలిటేషన్ థెరపీ(Rehabilitation Therapy) ద్వారా లక్షణాల నుండి రిలీఫ్ లభిస్తుంది.
వ్యాయామంతో రిలీఫ్:
వెర్టిగో వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్(Exercise) అందుబాటులో ఉన్నాయి. ఇవి వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ థెరపీలో వాడే ఎక్సర్‌సైజెస్ ని పోలి ఉంటాయి. అయితే, మీకు వెర్టిగో సివియర్‌గా ఉంటే ఈ ఎక్సర్‌సైజెస్‌లు మీ అంతట మీరే చేసేయడం కంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి వారు సూచనల ప్రకారం చేయడం అవసరం.
బినైన్ పొజిషనల్ వెర్టిగో కొంచెం చిరాకుని కలుగ చేసే విషయమే అయినా ఇది సీరియస్ మాత్రం కాదు, అయితే, దీని వల్ల పడిపోయే చాన్సులు పెరుగుతాయి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీని లక్షణాలలో, డిజీనెస్(Dizziness), మీరు, మీ చుట్టూ ఉన్నవీ తిరిగిపోతున్నట్లు అనిపించే ఫీలింగ్, బ్యాలెన్స్ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి సమస్యలు ఉంటాయి.
లక్షణాలు:
వెర్టిగోకి కామన్‌గా ఉండే లక్షణాలలో డిజ్జీనెస్ ఒకటి. ఇది తల స్పీడ్‌గా తిప్పడం వల్ల తీవ్రం అవుతుంది. తాము తిరిగిపోతున్నట్లో, చుట్టూ ఉన్న వారూ, చుట్టూ ఉన్న వస్తువులూ తిరిగిపోతున్నట్లో అనిపిస్తుంది అని రోగులు చెబుతూ ఉంటారు. ఇతర లక్షణాలు, చెమట ఎక్కువగా ఉండడం, వికారం, వాంతులు ఉంటాయి.
కొన్ని జాగ్రత్తలు..
మీ వెర్టిగోకి కల కారణాలని బట్టి మీ డాక్టర్ మీకు కొన్ని సూచనలిస్తారు. ఆ సూచనల్లో ఇవి కూడా ఉండవచ్చు:
మీ సింప్టమ్స్(Symptoms)ని కరెక్ట్ చేసే సింపుల్ ఎక్సర్‌సైజెస్ చేయండి
- తల కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని పడుకోండి
- మంచం మీద నుండి లేచేప్పుడు సడన్ గా లేవకండి, ఒక నిమిషం కూర్చుని అప్పుడు లేవండి.
- వంగుని నేల మీద నుండి ఏవైనా తీయడాన్ని అవాయిడ్(Avoid) చేయండి
- మెడ చాపకండి.
- రోజు వారీ పనుల్లో స్పీడ్‌గా తల తిప్పకండి.