మెగా హీరో(Mega Hero) వరుణ్ తేజ్(Varun Tej) నటిస్తున్న ‘గని’(Gani) మూవీ విడుదల తేదీ(Release Date) పై చిత్ర టీమ్ అప్డేట్(Update) ప్రకటించారు.
కానీ రెండు డేట్ల(Two Dates)ను ప్రకటిస్తూ మళ్లీ ప్రేక్షకులను కన్ఫ్యూషన్ లో పడేశారు. ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళవారం చిత్ర నిర్మాతా(Movie Producers)లు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా(Corona) ఆంక్షల నేపథ్యంలో థియేటర్లు(Theaters) పూర్తిగా తెరుచుకోలేదు. ఆ కరోనా పరిస్థితులు త్వరలోనే పూర్తిగా సర్దుకుంటాయని, ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ‘గని’ సినిమాను ఫిబ్రవరి 24(February 24th) లేదా మార్చి 4(March 4th)న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. తెలుగు చిత్రసీమకు సంబంధించిన కొన్ని పెద్ద సినిమాలు(Big Movies) విడుదల కానున్న సందర్భంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన తరువాత, పరస్పర అవగాహన, ఒప్పందం(Agreement)తో ఓ నిర్ణయానికి వచ్చామని, వారికి ఇబ్బంది కలగకుండా సినిమా రిలీజ్ పై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బాక్సింగ్(Boxing) నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి(Kiran Korrapaati) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద(Siddu Mudda) అలాగే అల్లు అరవింద్(Allu Arvind) కుమారుడు అల్లు బాబీ(Allu Bobby) ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఉపేంద్ర(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), లాంటి స్టార్ హీరో(Star Heroes)లు నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్ల(Posters)కు మంచి రెస్పాన్స్(Good Response) వచ్చింది.
కానీ రిలీజ్ డేట్ పై మేకర్స్(Makers) సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశ చెందారు. ఇదే బాటలో ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీని కూడా మార్చి 18కి లేదంటే, ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ‘మార్చి 25’న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదే విధంగా గని రిలీజ్ డేట్ ను మరోసారి మార్చే నిర్ణయం తీసుకోనున్నారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘గని’ మూవీ మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’కు ముందే విడుదల చేయాలనుకుంటన్నారు సమాచారం.
గని సినిమా(Gani Movie)లో వరుణ్ తేజ్(Varun Tej)కు జంటగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్(Sai Manjerkar) హీరోయిన్గా నటిస్తోంది. నవీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్ర(Important Role)ల్లో కనిపించనున్నారు.
వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్(Block Buster) అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. వరుణ్ తేజ్‘గని’ చిత్రంతో పాటు ఎఫ్ 2(F2) మూవీకి సీక్వెల్(Sequel)గా ఎఫ్ 3(F3) మూవీ కూడా విడుదలకు సిద్ధం(Ready)గా వుంది.
వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ లుక్(Different)లో బాక్సర్(Boxer)గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసిన టీజర్(Teaser) ఆడియన్స్(Audience) ని బాగా ఆకట్టుకున్నది. అంతేకాదు ఈ మూవీలో తమన్నా(Thamanna)స్పెషల్ సాంగ్(Special Song)లో నటించిన విషయం తెలిసిందే.
సంక్రాంతి కానుకగా తమన్నా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది.