దాదాపు దేశ వ్యాప్తం(Country Wide)గా లక్షకుపైగా కడుపులో గ్యాస్(Gas), మలబద్ధకం(Constipation) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం.
ఇతర అలవాట్ల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంటి చిట్కాల(Tips)ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అవును ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు సులభంగా పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు(Health Experts) తెలుపుతున్నారు.
వజ్రాసనం(Vajrasanam)లో కూర్చొని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే(Improves Digestion) కాకుండా సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం(Relief) లభిస్తుంది.
చెడు ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల గ్యాస్-ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల జీర్ణక్రియ బలహీనంగా తయారవుతుంది. దీంతో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వజ్రాసనం వేయాల్సి ఉంటుంది.
ఈ ఆసనం ప్రతి రోజూ వేయడం వల్ల సులభంగా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. వజ్రాసనం అనేది ఆహారం తిన్న తర్వాత చేసే ఏకైక భంగిమ. అంతేకాకుండా చాలా మంది వజ్రాసనాన్ని ధ్యానం యోగా(Yoga) అని కూడా అంటారు. వజ్రసనం వేయడం చాలా కఠినం ఎందుకంటే అన్ని ఆసనాలకంటే కొంత కఠనంగా ఉండొచ్చు.
ఈ అసనాన్ని ప్రతి రోజూ వేయడం వల్ల సులభంగా గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆహారాన్ని త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి బలపడుతుంది. గ్యాస్-ఎసిడిటీ, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒత్తిడి(Stress), వెన్నునొప్పి సమస్యలు(Back Pain Problem) దూరమవుతాయి. వజ్రాసనం అందరు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
మోకాలి నొప్పులు, గాయం లేదా శస్త్రచికిత్స (Treatment) ఉంటే ఈ వ్యాయామాన్ని(Exercise) చేయకపోవడం చాలా మంచిది. వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీనికి దూరంగా ఉండాలి.
పేగు పుండుతో బాధపడేవారు కూడా వజ్రాసనం చేయకూడదు.