వాల్తేర్ వీరయ్య(Walteru veerayya) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మెగాస్టార్(Mega star) చిరంజీవి(Chiranjeevi) ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే జోషలో తదుపరి చిత్రం ‘భోలా శంకర్’ (Bhola Shankar) షూటింగ్లో పాల్గొంటున్నా చిరు. తమిళ్లో అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రానికి మెహర్ రమేష్ (Meher Ramesh) దర్సకత్వం(Direction) వహిస్తున్నారు.
తమన్నా (Tamannaah) హీరోయిన్ కాగా చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుందని అభిమానులు భావించారు. కానీ తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కంబోలో వస్తున్న మెగా మూవీ ‘భోళా శంకర్’ ఆగస్ట్ 11(August 11th)న ప్రపంచ వ్యాప్తం(World wide)గా భారీ ఎత్తున విడుదల కానుందని ప్రకటించారు.
ఉగాది పండగ పురస్కరించుకొని మేకర్స్(MAKERS) ఈ మెగా అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్(Announcement Poster)లో చిరంజీవి గ్రీన్ కుర్తాలో హ్యాండ్సమ్గా కనిపించారు. అలాగే రాయల్ చెయిర్లో చెరో వైపు కూర్చున్న కీర్తి సురేష్, తమన్నా సంప్రదాయ దుస్తుల్లో బ్యూటిపుల్‌గా దర్శనమిచ్చారు.
ఇప్పటికే ‘భోళా శంకర్’ ప్రమోషనల్ కంటెంట్(Promotional Contents)కు అద్భుతమైన ఆదరణ పొందగా అక్కినేని యంగ్ హీరో సుశాంత్(Sushanth) ఈ చిత్రంలో స్పెషల్ రోల్(Special Role) లో కనిపించనున్నారు. అంటే సుశాంత్ కీర్తి సురేష్ ని ప్రేమించే వ్యక్తిగా కనిపించే ఛాన్స్ ఉంది. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్(AK Entertainments Banners)పై రూపొందుతున్న చిత్రానికి రామబ్రహ్మం, అనిల్ సుంకర నిర్మాతలు. తిరుపతి మామిడాల డైలాగ్స్ అందివ్వగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్(Editor)గా పనిచేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘భోలా శంకర్’ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, శ్రీముఖి, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ యాక్షన్ సీక్వెన్స్(Action Sequences) డిజైన్ చేస్తున్నారు. ఇక రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ లిరిక్స్ అందిస్తున్నారు.
మహతి స్వర సాగర్(Mahathi swara sagar) మ్యూజిక్(Music) కంపోజ్ చేస్తున్న చిత్రానికి డాన్స్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారు.