తెలంగాణ(Telangana)లోని ఉద్యోగార్థులకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్(Good News) చెప్పింది. మరో 23 ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్(Notification) విడుదల(Release) చేసింది.
తెలంగాణలో ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ(Financial Department) నుంచి అనుమతులు లభించాయి. దీనిలో ముఖ్యంగా గురుకుల పోస్టుల(Gurukula Posts)తో పాటు గ్రూప్ 3(Group 3) కింద 1373, గ్రూప్ 2(Group 2) కింద 663 పోస్టులు ఉన్నాయి.
ఇటీవల మొత్తం 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వరుస నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ విడుదల చేస్తోంది.4 ఆర్థిక శాఖ నుంచి మొత్తం 52,460 పోస్టులకు అనుమతి లభించింది.
ఇటీవలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్(AEE) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా 23 మహిళా(Women), శిశు సంక్షేమాధికారి(Child Welfare Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులు (Applications) సమర్పించవచ్చు.
అక్టోబర్ 10న దరఖాస్తులకు ఆఖరు తేదీ(Last Date)గా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ఆఫీషియల్ వెబ్ సైట్(Official website) ను సందర్శించి తెలుసుకోవచ్చు.
మల్టీజోన్ల(Multi Zones) వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు(Application) చేసుకునే అభ్యర్థుల(Candidates) యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల(Age) మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 చెల్లించనున్నారు.
అర్హతల విషయానికి వస్తే..
హోం సైన్స్(Home Science) లేదా సోషల్ సైన్స్(Social Science), లేదా ఫుడ్(Food) అండ్ న్యూట్రీషియన్(Nutrition) లో డిగ్రీ(Degree) పూర్తి చేసి ఉండాలి.
అంతే కాకుండా.. బోటనీ(Botany), బయాలజీ(Biology), బయో కెమిస్ట్రీ(Bio Chemistry) తో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక మిగిలిన పోస్టులకు కూడా అంత్యంత వేగంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన ప్రతీ పోస్టుకు సంబంధించి ఇంటెండ్లను తెప్పించుకుంటుంది కమిషన్(Commission). అవి అందిన వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్(Chairman) పేర్కొన్నారు.