తెలంగాణ(Telangana) నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4(Group – 4) నోటిఫికేషన్(Notification) ను డిసెంబర్ 1న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల(Release) చేసిన విషయం తెలిసిందే.
మొత్తం 9168 గ్రూప్-4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది తెలంగాణ సర్కార్.
మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ డిసెంబర్ 23న ప్రారంభించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది.
దరఖాస్తులను డిసెంబర్ 30 నుంచి ప్రారంభం అవుతాయని వెబ్ నోట్ రిలీజ్ చేసింది. అయితే డిసెంబర్ 30న ఉదయం అప్లికేషన్ ప్రక్రియ(Application Process) ప్రారంభం కాలేదు. డిసెంబర్ 30 రాత్రి 11.30 సమయంలో అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.
అదే రోజు పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే ముందుగా ప్రకటించిన 9168 పోస్టులను విడుదల చేస్తామని ప్రకటించిన బోర్డు.. తర్వాత 8039 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. పంచాయతీ రాజ్(Panchayat Raj) డిపార్ట్ మెంట్ నుంచి అనుకున్న పోస్టుల కంటే.. తక్కువ పోస్టులను చూపించడంతో ఆ పోస్టులు తగ్గాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గరయ్యారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా జనవరి 30 వరకు అవకాశం(Chance) కల్పించారు.
దరఖాస్తు తేదీని పొడిగించే అవకాశమే లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులంతా సాధ్యమైనంత ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అకౌంటెంట్స్(Junior Accountancy), జూనియర్ అసిస్టెంట్(Junior Assistant), వార్డు ఆఫీసర్(Ward Officer), జూనియర్ ఆడిటర్(Junior Auditor) వంటి విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పరీక్షను ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షను నిర్వహిస్తామని గ్రూప్ 4 నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే మే 07(May 07th) వ తేదీన గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 300 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్(General Studies) పేపర్ కు సంబంధించి 150 మార్కులు, పేపర్ 2లో సెక్రటేరియల్ ఎబిలిటీ(Secretariat Ability) నుంచి 150 మార్కులు ఉంటాయి.
2018లో నిర్వహించిన గ్రూప్ 4 కంటే.. ఈ సారి ప్రశ్నల స్థాయి పెరిగే అవకాశం ఉంది.