తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతిలో ఉన్న సీట్లు(Seats), ఏడు నుంచి పదోతరగతి వరకు మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు.
మోడల్ స్కూళ్ల(Model School)లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు.6 నుంచి 10వరకు(6th to 10th) కొత్త సీట్ల(New Seats)ను, మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు.
మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం(English Medium)లో బోధన ఉంటుంది. ట్యూషన్ ఫీజు(Tution Fee) ఉండదు. ఉచితం(Free)గా పాఠ్యపుస్తకా ఇస్తారు. ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తారు. బాలికల(Girls)కు ఉచిత వసతి సౌకర్యం ఉంది.
మరిన్ని వివరాలు తమ వెబ్ సైట్ (http://telanganams.cgg.gov.in)లో పొందవచ్చని తెలిపింది. దరఖాస్తులను January 30-01-2022 తేదీ నుంచి వెబ్ సైట్(Website) ద్వారా డౌన్లోడ్(Download) చేసుకోవచ్చని వివరించింది. మంచి విద్యతో పాటు ఐఐటీ జేఈఈ, నీట్(NEET), ఎంసెట్(Eamcet), సీఏ(CA), టీపీటీ(TPT), సీఎస్(CS) తదితర పోటీ పరీక్షల(Competitive Exams)కు సంబంధించి ఉచిత శిక్షణ(Free Training) ఇస్తారు.
అడ్మిషన్ టెస్ట్(Admission Test) లో సాధించిన మెరిట్(Merit) ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి పాఠశాలలో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌కు 50 చొప్పున మొత్తం 100 సీట్లు ఉంటాయి.
విద్యార్హతలు, వయోపరిమితి:
విద్యార్థులు ప్రవేశం పొందాలనుకొన్న తరగతికి కింది స్థాయి తరగతి చదువుతూ ఉండాలి. ఆరో తరగతిలో చేరే విద్యార్థి వయసు ఆగస్టు 31 నాటికి పదేళ్లు నిండాలి. ఏడోతరగతికి 11 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13 ఏళ్లు, పదోతరగతికి 14 ఏళ్లు నిండాలి.
ప్రవేశ పరీక్ష విధానం:
- ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానం(Objective Type)లో నిర్వహిస్తారు. అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే(MCQ) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పరీక్ష సమయం(Exam Time) రెండు గంటలు. లాంగ్వేజెస్(Languages) మినహా అన్ని సబ్జెక్టు(All Subjects)ల్లో ప్రశ్నలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు.
- ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో అయిదో తరగతి సిలబస్(Syllabus) నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, మేథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు.
- ఏడో తరగతి నుంచి పదో తరగతిలో ప్రవేశాల(Entrance exam)కు నిర్వహించే పరీక్షలో ఇంగ్లీష్, మేథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు అడుగుతారు. కింది తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎగ్జామ్ ఫీజు: జనరల్(General), ఈడబ్ల్యూఎస్(EDWS) విద్యార్థులకు రూ.150; దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.75 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022
హాల్ టికెట్ డౌన్లోడ్: ఆరో తరగతి అభ్యర్థులకు ఏప్రిల్ 8(April 8th) నుంచి; ఏడు నుంచి పదోతరగతి అభ్యర్థులకు ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిషన్ టెస్ట్ తేదీ: ఆరో తరగతి అభ్యర్థులకు ఏప్రిల్ 17న; ఏడు నుంచి పదోతరగతి అభ్యర్థులకు ఏప్రిల్ 16(April 16th )న పరీక్ష నిర్వహిస్తారు.
విద్యార్థుల మెరిట్ లిస్ట్ విడుదల: మే 20, 2022
సెలెక్షన్ లిస్ట్ విడుదల: మే 23, 2022
వెబ్సైట్: https://telanganams.cgg.gov.in/