తెలంగాణ(Telangana)లోని నిరుద్యోగుల(Umemployers)కు శుభ వార్త(Good News) చెప్పిన తెలంగాణ ప్రభుత్వం .
తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో (TS Gurukula schools).. ఒప్పంద ప్రాతిపదికన(Contract) టీజీటీ(TGT), ఎస్‌జీబీటీ(SGBT), వార్డెన్(Warden) తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది(Release). ఈ నోటిఫికేషన్ ద్వారా 42 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి(Interest), అర్హత(Qualified) కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోని అంధుల ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా(RangaReddy District)ల్లోని ప్రభుత్వ వికలాంగుల హాస్టళ్ల(Govt Handicapped Hostels)లో పనిచేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారం(Interview Based)గా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్(E-mail) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను https://wdsc.telangana.gov.in/ వెబ్సైట్(Website)లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతం, ఎంపిక విధానం మొదలైన నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం ఇక్కడ చూడచ్చు!
మొత్తం ఖాళీల సంఖ్య: 42
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 15
ఎస్‌జీబీటీ టీటీచర్ పోస్టులు: 15
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు: 2
వార్డెన్ పోస్టులు: 10
ముఖ్య సమాచారం:
అర్హతలు: పోస్ట్ ను బట్టి సంబంధిత స్పెషలైజేషన్(Specialization)లో ఇంటర్మీడియట్(Intermediate), బ్యాచిలర్ డిగ్రీ(Bachelor degree), బీఈడీ(B.ed), స్పెషల్ డీఈడీ(Special B.Ed) (హెచ్‌హెచ్/వీహెచ్), స్పెషల్ బీఈడీ(Special B.ED)(వీహెచ్/హెచ్‌హెచ్), ఎంఏ(M.A) (సోషల్ వర్క్/సోషియాలజీ), డీపీఈడీ(DPED) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం(Experience) కూడా ఉండాలి. ఇంగ్లీషు మీడియం(English Medium)లో బోధనా నైపుణ్యాలు(Teaching Skills) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. రిటైర్డ్ ఉపాధ్యాయులు(Retd.Teachers) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్లకు మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000ల వరకు జీతం(Salary)గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: [email protected]
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 14, 2022
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://wdsc.telangana.gov.in/