ఓం రౌత్(OM RAUTH) దర్శకత్వం(Direction)లో ప్రభాస్(Prabhas) హీరో(Hero)గా రూపొందించిన చిత్రం ఆదిపురుష్(Adipurush). ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నెలకొంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికైతే ఈ సినిమాను జూన్ 16(June 16th)న విడుదల చేస్తామని ప్రకటించారు.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీదున్న హైప్ అందరికీ తెలిసిందే. అలానే ఆ సినిమా టీజర్(Teaser) మీద వచ్చిన ట్రోల్స్ గురించి కూడా తెలిసిందే. సినిమా మీదున్న క్రేజ్ కాస్తా డల్ అయిపోయింది. నాసిరకమైన వీఎఫ్ఎక్స్(VFX), రాముడు, ఆంజనేయుడు, రావణుడ్ని చూపించిన తీరు కూడా అభ్యంతరకరంగా మారింది.
దీంతో సినిమా టీం అంతా కూడా రిపేర్లు చేసేందుకు రెడీ అయింది. గత ఏడాది రావాల్సిన ఈ సినిమాను పలు మార్లు వాయిదాలు వేస్తూనే వస్తున్నారు.
జూన్ 16న ఆడియన్స్(Audience) ముందుకు రాబోతోన్నామని ఇప్పుడు ఓ తేదీని ఖరారు చేసారు మేకర్స్. జూన్‌లో ఆదిపురుష్ సందడి చేయబోతోన్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమాను ఓ మూడ్రోజుల ముందే అంతర్జాతీయ(International) వేదికపై స్క్రీనింగ్(Screening) చేయబోతోన్నారని ప్రకటించారు. ట్రైబెకా ఫెస్టివల్(Trabuco Festival)లో ఈ సినిమాను స్పెషల్(Special)గా ప్రదర్శించబోతోన్నారట.
జూన్ 13(June 13th)న ఈ సినిమాను అక్కడ స్క్రీనింగ్ చేయబోతోన్నామని ఓం రౌత్ ట్వీట్ వేశాడు. ఇప్పుడు ఆదిపురుష్‌కు ఓం రౌత్ చేసిన రిపేర్లు జనాలను ఆకట్టుకుంటాయా? లేదా? అన్నది చూడాలి. అసలే వీఎఫ్ఎక్స్, ఆ విజువల్స్(Visuals), ఆ గెటప్స్ అన్నీ కూడా ట్రోలింగ్(Trolling)కు గురవుతూనే ఉన్నాయి.
రిపేర్లు చేయడానికే దాదాపు వంద కోట్లు అధనంగా ఖర్చు చేసినట్టుగా టాక్ వచ్చింది. మరి ఈ సారి వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత(Sita)గా కృతి సనన్(Krithi sanon), రావణుడిగా సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)లు నటించిన సంగతి తెలిసిందే.