సైనిక్ స్కూల్ చంద్రాపూర్ (Sainik School, Chandrapur) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. టిజిటి(TGT), పిజిటి(PGT) తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు సైనిక్ స్కూల్ చంద్రాపూర్ అధికారిక వెబ్ సైట్(Official Website) sainikschoolchandrapur.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీ(Last Date)గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు..
TGT హిందీ 1
PGT ఇంగ్లిష్ 1
PGT ఫిజిక్స్ 1
PGT కెమిస్ట్రీ 1
PGT మాథ్స్ 1
PGT బయోలజీ 1 1
PGT కంప్యూటర్ సైన్స్ 1
ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ 1
ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ 1
ల్యాబ్ అసిస్టెంట్ బయోలజీ 1
అర్హతల వివరాలు:
సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ(degree), పీజీ(PG) చసిన అభ్యర్థులు TGT, PGT చేసిన అభ్యర్థులు ఆయా ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పస్టం చేశారు. ఇంటర్(Inter) చేసిన అభ్యర్థులు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వేతనాలు:
టిజిటి, హిందీ(Hindi) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వేతనం చెల్లించనున్నారు. పిజిటి ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.47,600, ల్యాబ్ అసిస్టెంట్(Lab Assistant) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 చెల్లించనున్నారు. ఇంకా ఉచితంగా వసతి సదుపాయం(Free Accommodation), ఇద్దరు పిల్లలకు ఫ్రీగా విద్య(Free Education) అందిస్తారు.
అప్లై చేసుకునే విధానం:
- అభ్యర్థులు(Candidates) ముందుగా అధికారిక వెబ్ సైట్(Official Website) https://www.sainikschoolchandrapur.com ను ఓపెన్ చేయాలి
- అనంతరం హెం పేజీలో కనిపించే STAFF RECRUITMENT NOTIFICATION (PGT) DATED 05-FEB-2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- తరువాత 6 దశల్లో అప్లికేషన్ ప్రాసెస్(Application Process) ఉంటుంది.
- కావాల్సిన వివరాలను నమోదు చేసుకుని అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్(Application Form) ను పూర్తి చేయాల్సి ఉంటుంది.