బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) అప్పుడే పదమూడో వారం కూడా చివరి దశకు చేరుకుంది. వీకెండ్ వస్తుందంటే చాలు కంటెస్టెంట్స్(Contestants) కి చెప్పలేనంత టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే నాగ్ సర్ హౌస్ మేట్స్(House mates) కి క్లాస్ పీకే టైం అలాగే ఎలిమినేషన్ ఉంటుంది. ఇక టికెట్ టూ ఫినాలే రేస్(Ticket to Finale) చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు రౌండ్ లు ముగిసింది, ఈ టాస్క్ లో మానస్ లీడ్ లో వున్నాడు.
మరి ఈ రేస్ లో మొదటి ఫైనలిస్ట్ ఎవరు అనేది హౌస్ మేట్స్ తో పాటు చూసే ప్రేక్షకులకు కూడా ఉత్కంఠంగా మారింది. ఇక ఈ వారం పింకీ లేదా కాజల్ కానీ ఎలిమినేట్(Eliminate) అయ్యే అవకాశం ఉందని పింకీ గెస్ చేసింది. అయితే షణ్ముఖ్ మాత్రం మానస్ ఎలిమినేట్ అవ్వచ్చేమో అని అభిప్రాయపడుతాడు.
ఏమో మరి బిగ్ హౌస్(Big Boss) లో ఏమైనా జరగచ్చు. కానీ ఆడియన్స్ పోలింగ్(Audience Polling) లో అత్యంత తక్కువ ఓట్లు పింకీ కి వచ్చాయి.
ఇక శుక్రవారం నాటి 90 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం.
‘టికెట్ టు ఫినాలే'(Ticket to Finale) టాస్క్ లో ఫోకస్ ఛాలెంజ్‌ని (Focus Challenge) సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్స్(Contestants). ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్(Big Boss) తెలిపాడు. అయితే కాజల్ పదేపదే మధ్యలో మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ని డిస్టర్బ్ చేయడంతో సన్నీ ఆమెపై మండిపడ్డాడు.
దీనితో కాజల్ నేను గేమ్ ఆడుతున్న నువ్వు టాస్క్(Task) మీద ఫోకస్ చెయ్యి అని సన్నీ తో వాదన పెట్టుకుంటుంది. ఇక హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఆటపాటించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఆ తరువాత సన్నీని టాస్క్(Task) ఆట ఆడేటప్పుడు డిస్టర్బ్ చేసినందుకు కాజల్ చాల సార్లు సారీ చెప్పింది. కానీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు ఆమెను ఆటపాటించాడు. దీనితో విసిగిపోయిన కాజల్ కోపం తో టిష్యూ పేపర్(Tissue Paper)ను సన్నీ ముఖం మీద విసరగా అతడు సహనాన్ని కోల్పోయిన సన్నీ కామన్సెన్స్ లేదని తిట్టాడు. దీంతో కాజల్ దుప్పటి కప్పుకుని ఏడ్చింది . ఇదంతా చుసిన మానస్ ఆమెను ఓదార్చాడు.
టికెట్ టు ఫినాలే టాస్క్ (Ticket to Finale task)లో ఐదో ఛాలెంజ్(Challenge) గా అక్యురెసీ(Accuracy)ని ఎంచుకున్నారు హౌస్మేట్స్(House mates). ఈ టాస్క్ లో బోర్డుపై ఉన్న బల్బ్స్ లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్ చేసినవారు అన్ని లైట్స్ ని ఆన్ చేరినవారు మొదటి స్థానంలో నిలుస్తారు.
ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున ఈ టాస్క్ ను షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్, శ్రీరామ్ ఫినాలే టికెట్ కోసం పోటీపడ్డారు.
సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తెలిసిన సలహాలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు.
ఇప్పుడు కొత్తగా సిరికి వైద్య సలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్(Big Boss) నీకోసం కానీ, ఇతర హౌస్ మేట్స్(House mates) కోసం కానీ సొంత వైద్యం చేయడం మంచిది కాదని హెచ్చరించాడు(Warning). ఈ దెబ్బతో పింకీ అయోమయం గా ఉండిపోయింది.
ఇక చివరి రౌండ్(Final Round)లో శ్రీరామ్, మానస్ పోటీపడ్డాడరు. బరువైన బ్యాగ్‌కి తాడు కట్టి దాని సాయంతో కింద ఉన్న బ్లేట్స్ని ఇరగొట్టాలి. అయితే మానస్ బ్యాగ్(Bag) కడ్డీలో ఇరుక్కుని పోవడంతో శ్రీరామ్ ఈ టాస్క్ (Task)లో విజేత గా నిలిచి టికెట్ టు ఫినాలే(Ticket to Finale) పొందాడు.
షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని శ్రీరామ్ వారికి థాంక్స్ చెప్పాడు. ఫస్ట్ ఫైనలిస్ట్(First Finalist) అయ్యానోచ్ అంటూ తెగ సంతోషపడిపోయాడు.
శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు.మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ బాధపడ్డాడు. ఫినాలే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో ఫీలయ్యాడు.