బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) లో అప్పుడే మూడో వారం పూర్తి కావస్తోంది.ఇప్పటికే ఎలిమినేషన్(elimination) కి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ వారం నామినేషన్ లో ప్రియాంక, ప్రియా, లహరి, శ్రీరామ్ చంద్ర, మానస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారం కెప్టెన్ ని ఎంపిక చేసే ప్రక్రియలో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చాడు.
షేమ్ అఫ్ వాల్ టాస్క్ లో ప్రియా, లహరి మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్ కాస్త పెద్ద రచ్చ కి దారి తీసింది.
ఆ తరువాత హైదరాబాద్ అమ్మయి- అమెరికా అబ్బాయి టాస్క్ లో హౌస్ మేట్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు తమ యాక్టింగ్ ఇరగదీసారు.
కెప్టెన్సీ(captency) పోటీదారుడు పోటీకి ఎంపిక అయ్యే అవకాశాన్ని సీక్రెట్ టాస్క్ ద్వారా రవికి ఇచ్చిన బిగ్ బాస్.
ఇందులో భాగంగా ప్రియా నెక్లెస్ కొట్టేయాలని ఆదేశించిన బిగ్ బాస్.
ఈ టాస్క్ ని విజయవంతం గా పూర్తి చేసిన రవిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడుగా ఎంపిక చేసినట్టు తెలిపిన బిగ్ బాస్.
ఈ వారం కెప్టెన్ ఎవరు? ఇంకా హౌస్ లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి 19 ఎపిసోడ్ లోకి ఓ లుక్ వేయాల్సిందే.
‘అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి’ టాస్క్ లో పాల్గొన్న మూడు టీంలలో ఒక్కొక్కరు ఒక్కో బెస్ట్ పెర్ఫామర్ (Best Performer)ని ఎంపిక చేసుకోవాలనే వాళ్లే కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారని బిగ్ బాస్ చెప్పడంతో.. అందరూ డిస్కస్ చేసి శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలను కెప్టెన్సీ పోటీదారుగా ఎంపిక అయ్యారు.
అయితే కెప్టెన్సీ పోటీదారునిగా తాను ఉంటానని లహరి గట్టిగానే అర్గ్యూ చేస్తుంది . అది కుదరకపోవడంతో కోపం తో ఇరిటేట్ అవుతుంది లహరి.
సన్నీ, లోబోలపై అరిచి.. నాకు ఇష్టం లేకపోయినా తన టీంలో జెస్సీకి సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పింది.
రవి ఎప్పటిలాగే డబుల్ మైండ్‌తో అటు జెస్సీ.. ఇటు లహరి అని అంటూ.. తెలివిగా కన్వెన్స్ చేసి లహరితోనే జెస్సీకి సపోర్ట్ చేసేలా చేస్తాడు రవి.
మరోపక్క షణ్ముఖ్ మాట్లాడట్లేదని సిరి ఫీల్ అవుతుంది . ప్లీజ్ మాట్లాడరా.. అంటూ అతడి వెనకాల పడుతుంది . అయినప్పటికీ ఏమాత్రం చలించిన షణ్ను నీతో ఫ్రెండ్‌షిప్ కూడా ఇంట్రస్ట్ లేదని ముఖం మీదే చెప్పడంతో, సిరి ముఖం మాడ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది .
‘షణ్ను ఎక్కువగా శ్వేతతో ఉంటున్నాడు, నేనేమైనా అంటున్నానా? నాకు స్పేస్ ఇవ్వట్లేదు, దూరం పెడుతున్నాడు’ అంటూ కాజల్ దగ్గర ఎమోషనల్(emotional) అయింది సిరి. అయితే వీళ్లిద్దరినీ కలిపేందుకు జెస్సీ తెగ ట్రై చేసాడు.
ఈ కెప్టెన్సీ టాస్క్ కి లోబో సంచాలకుడిగా వ్యవహరించగా.. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రవి, శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలు పార్టిసిపేట్ చేస్తారు.
స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కెప్టెన్ అనే అనే అక్షరాలను ఒక్కొక్కటి పట్టుకుని వచ్చి అన్నింటినీ ముందు ఎవరైతే పేరుస్తారో వాళ్లే ఈవారం కెప్టెన్ అవుతారని బిగ్ బాస్(big boss) వెల్లడించాడు. అయితే అందరికంటే ముందుగా జెస్సీ.. ఈ టాస్క్ ని పూర్తి చేయడంతో బిగ్ బాస్ హౌస్‌కి మూడో కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు.
తర్వాత కెప్టెన్సీ టాస్క్ ‘స్విమ్ జర స్విమ్’ టాస్క్ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్క్(Captaincy task) కి లోబో సంచాలకుడిగా వ్యవహరించాడు.
కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రవి, శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలు పార్టిసిపేట్ చేసారు. పూల్‌లోని కెప్టెన్ అనే లెటర్స్‌ను తీసుకొచ్చి కెప్టెన్ అని రాసున్న ఖాళీ స్లాట్స్ లో పెట్టాల్సి ఉంటుంది.
ఈ టాస్కులో ముందు గా స్లాట్స్‌లో కెప్టెన్ లెటర్స్ ని పేర్చడంతో మూడో కెప్టెన్‌గా జెస్సీ గెలిచాడు. తరువాత షణ్ముఖ్‌ను రేషన్ మేనేజర్‌గా ఎంచుకున్నాడు. అయితే జెస్సీ కెప్టెన్ అవగానే గ్రూపులు మొదలయ్యింది లోబో నోరు జారాడు.
ప్రతి ఒకరి జీవితం లోను లవ్ స్టోరీ ఉంటుంది, ఫస్ట్ లవ్ ని మరచిపోవడం అంత ఈజీ కాదు. కొన్ని ఫన్నీ లవ్ స్టోరీస్ ఉండచ్చు, కొన్ని సక్సెస్ అయ్యి ఉండచ్చు, మరికొన్ని ఫెయిల్యూర్ అయుండచ్చు.
ఏదేమైనా తొలి ప్రేమ ఒక మధురానుభూతి, అది అనుభవించిన వాళ్లకి మాత్రమే తెలుస్తుంది అందులోని మేజిక్. అలాటి మెమోరీస్ ని హౌస్ మేట్స్(house mates) ని పంచుకోండి అంటూ అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్)big boss).
దాంతో హౌస్ మేట్స్ తమ మొదటి లవ్ ని గుర్తు చేసుకున్నారు. హౌస్ మేట్స్ అందరు తమ లవ్ స్టోరీస్ ని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
అయితే ప్రియాంక లవ్ స్టోరీ అందరి మనస్సులను కదిలించింది. తన లవ్ స్టోరీ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయినా ప్రియాంకని ఓదార్చిన హౌస్ మేట్స్.
మరి బిగ్ బాస్ మునుముందు ఇంకెన్ని ఎమోషన్స్ (Emotions)ని, చూపించపోతున్నాడో చూడాలి మరి ….