సర్జరీ (surgery) అంటేనే భయం. అలాంటిది రోబోటిక్ సర్జరీ (robotic surgery) అంటే…ఊహకే అందడం లేదు కదూ. అదెలా సాధ్యం అని ఆశ్చర్య పోతున్నారా. ఆధునిక సాంకేతిక విజ్ఞ్యానంతో మరి కొద్ది సంవత్సరాల్లో అందరికీ అందుబాటులోకి రాబోతున్న ఆధునిక వైద్య విధానం ఇది. ఇప్పటికే పదుల సంఖ్యలో మన దేశం లోని కొన్ని ఆసుపత్రులలో (hospitals) అందుబాటులో ఉంది. అమెరికాకు చెందిన Intutive Surgical అనే సంస్థ da vinci surgical systems పేరుతో ఈ సర్జికల్ రోబోట్స్ ను తయారు చేస్తోంది. వీటిని మన దేశంలో Vattikuti Technologies అనే సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది. ఈ అమెరికన్ సంస్థ నేరుగా వీటిని ఆసుపత్రులకు అమ్మేకంటే ఈ రంగంలో పెద్ద పెద్ద సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. గూగుల్ (Google) మరియు Johnson and Johnson ఈ రంగంలో కృషి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం, భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలియ చేస్తోంది.
అందుకు అనుగుణంగా ఈ సర్జరీ లు చేయగల వైద్య నిపుణుల సంఖ్య ప్రస్తుతం మన దేశంలో 147. ఈ సంఖ్యను 2020 కల్లా 300 కు చేర్చాలని vattikuti foundation ప్రణాళిక వేసుకుంది.
ఈ da vinci system లు Urology, Gynaecology, general surgery cardiothoraic వంటి వైద్య శాఖల్లో సర్జరీలు చేయగలవు. దీని వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటే అతి తక్కువ కత్తి పోట్లు (incision), అతి తక్కువ రక్త స్రావం, సర్జరీ తరువాత రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ రోబోటిక్ సర్జరీ లతో సాధ్యం. రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న వైద్య విజ్ఞానంతో ప్రస్తుతానికి కలలా అనిపించినా, భవిష్యత్తులో ఇది సర్వ సాధారణం అయిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు.