అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్(High Octane Action Entertainer) ‘ది ఘోస్ట్'(The Ghost) షూటింగ్(Shooting) దుబాయ్(Dubai)లో తిరిగి ప్రారంభమైంది.
ఈ మూవీలో నాగార్జున, ‘రా’ ఏజెంట్ పాత్ర(Agent Character)లో అలరించనున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్(Shooting) వాయిదా(Postpone) పడింది. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించాల్సింది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఈమె ప్లేస్‌లో సోనాల్ చౌహాన్(Sonal Chauhan)ను తీసుకున్నారు.
ఇది సుదీర్ఘమైన షెడ్యూల్ అని, మేకర్స్(Makers) సినిమాలోని ప్రధాన తారాగణానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున సరసన కథానాయికగా నటించేందుకు ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా ఈ షెడ్యూల్లో టీమ్(Schedule Team) తో జాయిన్ అయింది.
నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి(Sri Venkateswara Cinemas LLP), నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్(North Star Entertainment Banners) పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాగార్జున మరియు సోనాల్ చౌహాన్‌లతో పాటు, ఈ చిత్రంలో గుల్ పనాగ్ మరియు అనిఖా సురేంద్రన్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మ కడలి కళా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ముఖేష్ జి(Mukesh G) కెమెరా(Camera)ను అందిస్తున్నారు.
అక్కినేని నాగార్జున ఇటీవల నటించిన ‘బంగార్రాజు’ జనవరి(January)లో ప్రేక్షకుల(Audience) ముందుకు వచ్చింది, ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్ (Platform)లో ప్రసారం అవుతోంది. నాగార్జున-నాగ చైతన్య, తండ్రీకొడుకులు జంటగా నటించిన ‘బంగార్రాజు’ థియేటర్ల(Theaters)లో ప్రేక్షకులను బాగా అలరించింది.
నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్(Sequel) ‘బంగార్రాజు’, తెలుగు క్లాసిక్ మూవీ ‘మనం'(Manam) తర్వాత నాగార్జున మరియు నాగ చైతన్యల కాంబో(Combo)లో రెండవది ఈ చిత్రం. ఈ సినిమాలో నాగార్జున భార్యగా నటి రమ్యకృష్ణ నటించగా, నాగ చైతన్యకు ప్రేమగా కృతి శెట్టి నటించింది. ఇతర నటీనటులు ఫరియా అబ్దుల్లా, దక్ష ‘బంగార్రాజు’లో పాటల(Songs) సన్నివేశాల్లో కనిపించారు.
రావు రమేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఝాన్సీ ముఖ్య పాత్రల్లోనటించారు. బంగార్రాజు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) మరియు జీ స్టూడియోస్(Zee Studios) సంయుక్తంగా నిర్మించారు.