అందమంటే గుర్తొచ్చేది ఆడవాళ్లే. మరి వారి అందాన్ని మరింత పెంచేది మేకప్. అయితే ఈ మేకప్ మోతాదు ఎక్కువైతే మాత్రం అది వారికి అనేక వ్యాధుల బారిన పడేట్టు చేస్తుందని అంటున్నారు పరిశోధకులు. ఇలాంటివి ఎవరో ఒకరు చెపుతూనే ఉంటారు అనుకోకండి. ఈ సారి బల్ల గుద్ది చెబుతున్నది మాత్రం ప్రఖ్యాత University of California, Berkeley కి చెందిన పరిశోధకులు. మరి వీరి పరిశోధనా వివరాల్లోకి వెళ్దామా…
ఈ పరిశోధనకు లీడ్ author అయిన Dr. Kim Harley ఇందుకోసం మూడు రోజుల పాటు అమెరికా లో 100 మంది కాస్మెటిక్స్ ఉపయోగించే టీనేజ్ అమ్మాయిలను ఎంచుకున్నారు. వారిని మూడు రోజుల పాటు కాస్మెటిక్స్ మాని వేయమని చెప్పి వారి చేత కెమికల్స్ అతి తక్కువగా ఉండే బ్రాండ్లను ఉపయోగించమన్నారు. ఇప్పుడు వారు ఈ పరిశోధనకు ముందు ఆ తర్వాతా వీరి మూత్రాన్ని పరీక్షించగా – ఈ కాస్మెటిక్స్ ద్వారా శరీరంలోకి వచ్చి చేరుతున్న కొన్ని రకాల హానికర రసాయనాల స్థాయి 27 శాతం నుంచీ 45 శాతం వరకూ తగ్గిoదని తేలింది. అవేంటంటే ఫ్రాగ్రన్సు లలో (సెంటు మరియు డియో) వాడే రసాయనం diethyl phthalate, ఈ ప్రయోగం తరువాత 27 శాతం వరకూ తగ్గింది. అంతే కాదు వీటిలో ఉండే మరొక రసాయనం methyl మరియు propyl parabens 44 – 45 శాతం మేరకు తగ్గాయి. ఇక tooth paste మరియు సన్ స్క్రీన్ లలో వాడే triclosan మరియు benzophenone-3 (oxybenzone), 36 శాతం మేరకు తగ్గిందని కనుగొన్నారు.
ఇక ఈ పరీక్షకు టీనేజ్ అమ్మాయిలను ఎంచుకోవడానికి కారణం వీరు 25-30 దాటిన మహిళల కంటే ఎక్కువగా రోజులో కాస్మెటిక్ ఉత్పత్తులు వాడటమే కారణం. అలాగే వీరి పాకెట్ మనీ దృష్ట్యా ఆర్గానిక్ బ్రాండ్లు కాకుండా non-organic బ్రాండ్లు వాడటం మరొక కారణం.
సరే, ఇప్పుడు ఏ ఏ రసాయనాలు శరీరంలోకి వచ్చి చేరుతున్నాయో తెలిసింది కదా. ఇక వీటి వల్ల వారికి టీనేజ్ లో సమర్ధవంతంగా పని చేసే హార్మోన్ వ్యవస్థ దెబ్బ తింటుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాదు దీర్ఘ కాలం ఇటువంటి ఉత్పత్తుల వాడకం వల్ల కాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయని అంటున్నారు. అంతే కాదు ఇటువంటి రసాయనాలను జంతువుల మీద ప్రయోగించగా వాటి అండాశయాలు దెబ్బ తిన్నాయని కూడా రుజువైoది.
దీనిని బట్టి అమెరికాలో కూడా ఈ కాస్మెటిక్ ఉత్పత్తులను గూర్చి సరైన నియంత్రణ లేదని తెలుస్తోంది. ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో వారు వాడుతున్న ఉత్పత్తులలో ఉండే రసాయనాలను గూర్చి తెలియచేయడమే. అంతే కాదు నెలలో ఏ కొద్ది రోజులు ఈ కాస్మెటిక్ ఉత్పత్తులు మానేసినా ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది కదూ.
ఈ పరిశోధన Environmental Health Perspectives అనే జర్నల్ లో ప్రచురించబడింది.
ఆడవాళ్ళు బహు పరాక్. మీరు వాడుతున్న ఉత్పత్తులలో ఏ ఏ రసాయనాలు ఉన్నాయో గమనించండి. మీకు అందాన్ని ఏర వేసి ఆనక మీ ఆరోగ్యంతో ఆడుకునే బిలియన్ డాలర్ కాస్మెటిక్ సంస్థలకు నో చెప్పండి. ఆరోగ్యం తో వచ్చే అందం తో మెరిసిపొండి.