తెలంగాణ రాష్ట్రం(TS)లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, వాతావరణ శాఖ(Weather Cast) మరో పిడుగులాంటి వార్త(News) చెప్పింది.
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల(5Days) వాతావరణ నవీకరణల(Weather Updates)ను హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HWC) ప్రకటించింది.
గురువారం నుంచి రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారత వాతావరణ శాఖ(IWC) అంచనా(Expects) వేసింది.
అలాగే తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు(Heavy Rains) కురిసే ఛాన్స్ ఉంది.
నిర్మల్(Nirmal)లో అత్యధి(High)క వర్షపాతం: ఈ జిల్లాల్లో ఈదురుగాలులు(Stormy Winds) అంతేగాక, గురువారం మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రుతుపవనాలు(Monsoons) ప్రవేశించిన నాటి నుంచి తెలంగాణలో 135.1 మిల్లీమీటర్ల వర్షపాతంతో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలలో నిర్మల్ జిల్లా మొదటి స్థానం(First Place)లో ఉంది. నిజామాబాద్లో 128.2, జగిత్యాలలో 126.6, పెద్దపల్లిలో 112.7, కరీంనగర్లో 100.1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు(Officer Announced) ప్రకటించారు.
నిండుకుండల్లా మారిన ఉత్తర తెలంగాణ నీటి ప్రాజెక్టులు(Telangana Water Projects). ఉత్తర తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sri Ram Sagar Project)కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఎస్ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చరిత్రలో జూలై రెండో వారంలో గేట్లు(Open Gates) ఎత్తేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే 70 టీఎంసీ(70 TMC)ల నీరు ప్రాజెక్టులోకి చేరింది. అధికారులు 36 గేట్లను ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 76 టీఎంసీల నీటిమట్టం(Water Level) 1,087.9 అడుగులకు చేరింది.
బుధవారం 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో(In flow), 4.57 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో(Out Flow) కొనసాగింది.
రాష్ట్రంలోని కాళేశ్వరం(Kaaleshwaram) సహా ఇతర ప్రాజెక్టులు కూడా వరదనీరు(Flood Water)తో నిండుకుండలను తలపిస్తున్నాయి. గేట్లు ఎత్తివేసి వచ్చిన నీరును వచ్చినట్లుగా దిగువకు రిలీజ్ చేస్తున్నారు.