తెలంగాణ ఐసెట్(Telangana ICET) నోటిఫికేషన్ ను కాకతీయ యూనివర్సిటీ తాజాగా రిలీజ్ చేసింది. 2022- 23 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ రిలీజయ్యింది.
వరంగల్(Warngal)లోని కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్(Academic Chairman) లింబ్రాది(Limbadri), కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (University Vice- Chancellor) రమేశ్(Ramesh) బుధవారం,మార్చ్ ౩౦న విడుదల చేశారు.
మొత్తం 14 రీజినల్ సెంటర్లు(14 Regional Centers) ఏర్పాటు చేసినట్లు లింబ్రాది తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.1000 అపరాధ రుసుముతో(Penalty Fee) జూలై 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
జూలై 27, 28 రెండు రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తామని.. పరీక్ష ఫలితాల(Exam results)ను ఆగస్ట్ 22న రిలీజ్(Release) చేయనున్నట్లు పేర్కొన్నారు.