తెలంగాణ(Telangana)లోని నిరుద్యోగులకు శుభవార్త(Good news). గ్రూప్-1 పోస్టుల(Group-1 Posts)కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనుంది.
ప్రిలిమ్స్(Prelims ), మెయిన్స్(Mains) ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం(Telangana state formation) ఏర్పాటైన తరువాత మొదటిసారి(First time)గా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు.
మే 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ(TPSPSC) అధికారిక వెబ్ సైట్(Official Website) http://www.tspsc.gov.in/ లో పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు ధరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-1లో 19 రకాల పోస్టుల(19 types of posts)ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పష్టం చేసింది. ఈ గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు సెలెక్ట్ చేయనున్నారు.
కొత్త జీవో జారీ.. మల్టీ జోన్ల వారీగా గ్రూప్-1 పోస్టుల భర్తీ.. పోస్టుల వివరాలు ఇవే!
తెలంగాణలో గ్రూప్ -1కు సంబంధించి నోటిఫికేషన్ ఈ విడుదలైన, నేపథ్యంలో ప్రభుత్వం కీలక జీవో(JO55) 55ను విడుదల చేసింది. దీని ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీ(Other category)ల పరీక్ష విధానం(Exam Pattern,) సిలబస్(Syllabus)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని పేపర్లు ఉంటాయి..? ఏ పేపర్‌కు ఎన్ని మార్కులు ఉంటాయి..? పరీక్ష రాసేందుకు ఎంత టైం కేటాయిస్తారు..? తదితర వివరాలతో సమగ్రంగా ప్రభుత్వం ఈ జీవో 55ని జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీ విధానంలో పలు మార్పులు చేయటమే కాకుండా, పోస్టుల విభజన, పరీక్ష విధానాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్(Somesh Kumar) జీవో 55ను జారీచేశారు. గతంలో జారీచేసిన జీవో 11ను సవరించి, కొత్త జీవోను విడుదల చేశారు. గ్రూప్ -1లో 19 రకాల పోస్టులు,
గ్రూప్-2లో 16 రకాల పోస్టులున్నాయి.
తాజా జీవో ప్రకారం గ్రూప్ -1 మెయిన్స్ ను 900 మార్కులు, గ్రూప్-2ను 600 మార్కులకే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇంటర్వ్యూల రద్దు(No Interview)తో గ్రూప్ -1లో 100 మార్కులు, గ్రూప్ -2లో 75 మార్కులను తొలగించింది. అంతే కాకుండా.. గ్రూప్ -3లో 8 రకాల పోస్టులు, గ్రూప్ -4లో జూనియర్ అసిస్టెంట్(Junior Assistant), జూనియర్ అకౌంటెంట్(Junior Accountant) పోస్టులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్(Direct Recruitment)ను జీవో 55కు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని టీఎస్ఎఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
విభాగాల వారీగా ఖాళీలివే: 503
- జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు- 5
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు- 40
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు-38
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్- 20 (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)
- డీఎస్పీ- 91
- జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు- 2
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి- 121
- జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు- 5
- సీటీఓ- 48
- గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు- 35
- డిప్యూటీ కలెక్టర్లు- 42
- ప్రాంతీయ రవాణా అధికారి- 4
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్- 8
- జిల్లా ఉపాధి అధికారి- 2
- జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు- 6
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 26