కరోనా(Corona) విజృంభణ తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగ నియామకాలు ఊపందుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) పేదలకు వైద్యం(Treatment) మరింత చేరువ చేసేందుకు పల్లె, బస్తీ దవాఖానా(Hospitals)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
దింతో ఆ ఆయా పల్లె దవాఖానాల్లో ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా దరఖాస్తుల(Applications)ను స్వీకరిస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం(Badradri, Kothagudem) జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం అనేక ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు(Invited) వెల్లడించింది. మొత్తం 97 ఖాళీల(97 Posts)ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్(Medical Officer) విభాగంలో ఈ నియామకాలను చేపట్టనున్నారు.
ఎంబీబీఎస్(MBBS) విద్యార్హత(Education Qualification) కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. అభ్యర్థులు టీఎస్ మెడికల్ కౌన్సిల్(TS Medical Council) లో రిజిస్టర్(Register) చేసుకుని ఉండాలి.
మెరిట్ ఆధారంగా(Merit Based) అభ్యర్థుల ఎంపిక(Selection Process) ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28, చివరితేది(Last Date). అలాగే ఈ దరఖాస్తుకు వయో పరిమితి(Age Limit) అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 34 ఏళ్లు ఉండాలి.
రిజర్వేషన్ల(Reservations) ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అలాగే అభ్యర్థులు పూర్తి వివరాల(Full Details)ను తెలుసుకోవడానికి ఆఫీషియల్ వెబ్సైట్(Official Website) https://kothagudem.telangana.gov.in/ లో పరిశీలించవచ్చు.
దరఖాస్తు చేయు విధానం:
- ముందుగా https://kothagudem.telangana.gov.in/ వెబ్సైట్ను ఓపెన్(Open) చేయాలి.
- తరువాత హోం పేజీలో కనిపించే Application for Palle Dawakhana ఆప్షన్(Option) పై క్లిక్ చేయాలి.
- అనంతరం కొత్త విండో(New window)లో అప్లికేషన్ ఫామ్(Application Form) ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్(Down Load) చేసుకుని, ఫారం లో పూర్తి వివరాలను నింపాలి.
- తర్వాత ఈ దరఖాస్తు ఫామ్(Application Form)ను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(District Medical Officer Office)లో సబ్మిట్(Submit) చేయాలి.