తెలంగాణ(Telangana)లో ఎంసెట్ పరీక్ష(Eamcet Exam)కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మాత్రమే కాదు శాశ్వతంగా ఇంటర్ మార్కుల (Inter Marks)కు ఎంసెట్ లో వెయిటేజీ(Weight age)ని రద్దు చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు జీవో రిలీజ్(GO Release) కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాదికి ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అయితే భవిష్యత్ లోనూ వెయిటేజీని తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుకు ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ లో లాంగ్వేజ్ సబ్జెక్టు(Language Subjects)లు కాకుండా ఇతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీని ఇచ్చేవారు.
కరోనా కారణంగా ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతో 2020, 2021, 2022లో ఇంటర్ మార్కులకు ఎంసెట్ లో వెయిటేజీని తొలగించింది ప్రభుత్వం. అయితే భవిష్యత్ లోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. లేకపోతే ఇబ్బందులు వస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంసెట్ పరీక్షకు కేవలం తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులు మాత్రమే కాకుండా.. సీబీఎస్ఈ (CBSE), ఐసీఎస్ఈ(ICSE), ఆర్టీయూకేటీ(RTUKT), ఓపెన్ స్కూల్(Open school) తదితర బోర్డులకు చెందిన విద్యార్థులు హాజరవుతూ ఉంటారు. ఒక వెళ ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తే.. ఈ అన్ని బోర్డుల ఫలితాలు విడుదలయ్యే వరకు ఎంసెట్ ర్యాంకులను కేటాయించకుండా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
దీంతో కౌన్సెలింగ్(Counseling) అడ్మిషన్లు(Admissions) సైతం ఆలస్యం అవుతోంది. ఇంకా ఇంటర్ లో 80, 90 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఎంసెట్ లో కనీస ప్రతిభ చూపలేకపోతున్నారు. దీంతో వారికి సబ్జెక్ట్(Subject) నాలెడ్జ్(Knowledge) అంతగా లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అభ్యర్థులు సైతం ఇంటర్ మార్కుల వెయిటేజీతో ఎంసెట్ లో మెరుగైన ర్యాంకు పొందుతున్నారు.
జేఈఈ మెయిన్(JEE Main), నీట్(NEET) లోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్(Engineering), అగ్రకల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy) కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్(Online) దరఖాస్తుల(Application)ను అధికారులు ప్రారంభించున్నారు.
ఎలాంటి లేట్ ఫీజు(Late Fee) లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు(Candidates) అప్లై చేసుకోవచ్చు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.