తెలంగాణలో(Telangana) 80 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రిలీజ్(Release) చేస్తామని సీఎం కేసీఆర్(KCR) మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే నవంబర్ నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. వీటితో పాటు ఇటీవల తెలంగాణ కేబినెట్(Cabinet) మరో 7 వేలకు పైగా కొత్త పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో రోడ్లు అండ్ భవనాల శాఖ(R&D Department), బీసీ గురుకుల(BC Gurukula), పోలీస్ శాఖలో(Police Jobs) ఈ ఖాళీలను గుర్తించారు.
రోడ్లు, భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.
ఇందులో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్(Chief Engineer) పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్(Superintend Engineer) పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్(Executive Engineer) పోస్టులు, 102 డి.ఈ.ఈ(DEE) పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ(Assistant EE) పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) పోస్టులతో పాటు పలు టెక్నికల్(Technical), నాన్ టెక్నికల్(Non Technical) సిబ్బంది పోస్టులున్నాయి.
ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. బీసీ సంక్షేమ శాఖలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్(BC Welfare Residential) విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాల(Residential Schools)ల్లో టీచింగ్(Teaching), నాన్ టీచింగ్ స్టాఫ్(Non Teaching Staff) విభాగాల్లో అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
పోలీస్ శాఖలో మరో 4000 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో సైబర్ సేఫ్టీ బ్యూరో(Cyber Safety Bureau) పరిధిలో ఉన్న ఈ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్ ఆదేశించింది.
దీంతో పాటు.. కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్ల డివిజన్ల(Circle Division) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డ్రగ్స్(Drugs) నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక కొత్తగా ఆమోదం లభించిన ఈ 4వేల పోస్టుల్లో 3966 పోస్టులు త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఇలా మొత్తం 7029 కొత్త ఉద్యోగాల(New Jobs)కు కేమినెట్ ఆమోదం తెలిపింది.
వీటితో పాటు తెలంగాణలోని వివిధ న్యాయస్థానా(Court)ల్లో 4600కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. దీంతో తెలంగాణలో మొత్తం కొత్త పోస్టుల సంఖ్య 11 వేలకు పెరిగింది.
ఈ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్,ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే వారంలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.