ఆ దేవుడు సృష్టించిన పంచభూతాల్లో ఒక్కటైనది నీరు. నీటిఆవిరి వలన మేఘాలు, మేఘాల వలన వర్షాలు పడతాయి. ఇక ఆ వానల ద్వారానే మనందరి అవసరాలకు నీరు దొరుకుతుంది. అయితే ఆగష్టు లోకి ప్రవేశిస్తున్నా ఇంకా ఆ రుతుపవనాల జాడ అనేదే లేదు. వీటికి ఎల్ నినో, గ్లోబల్ వార్మింగ్ ఇలా ఎన్నో కారణమంటున్న నిపుణులు. పేరు ఏదైతేనేం మళ్ళి మంచి నీటి కరువు మొదలు. ఈ నేపధ్యంలో ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు పడితే…వానలు కురిస్తే!. అచ్చంగా అలాగే చేసాడు బెంగళూరు కు చెందిన ఒక శాస్త్రవేత్త. మనల్ని తడపకపోయిన మన దాహాన్ని తీర్చాడు. రండి, ఆ వాన విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం.

RC_Featured

డాక్టర్. రాజా విజయ్ కుమార్, బెంగుళూరు లోని De Scalene Research Organization లోని Chief Scientist Officer. ఆయన కనిపెట్టిన రెయిన్ టన్నెల్ టెక్నాలజీ మన నీటి కష్టాలను తీర్చబోతోంది. అదెలాగో చూద్దాం. ఇది ఒక వాషింగ్ మెషిన్ అంత పరిమాణం లో వుంటుంది. ఈ రెయిన్ టన్నెల్ టెక్నాలజీ లో గాలిలోని తేమను హై ఫ్రీక్వెన్సీ (High Frequency) శబ్ద తరంగాలు (Sound waves) ద్వారా అతి సూక్ష్మ నీటి బొట్లుగా (nano water particles) చేస్తుంది. ఇలా బొట్టు బొట్టు కలిసి పెద్ద నీటి బొట్టుగా తయారై ఇందులోని క్లౌడ్ ఛాంబర్లో 10-15 డిగ్రీల వద్ద ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించిన నీటి బొట్లు గ్రావిటీ వలన తమలోని నీటిని వర్షంగా వర్షిస్తాయి. ఇలా వర్షించిన నీటిని ఒక ఫుడ్ ఛాంబర్ లో సేకరించి తిరిగి దానిని 5 విధాలుగా శుద్ధి చేసి స్వచ్చమైన తాగు నీటిని మనకందిస్తాయి. ఇది ఒక కుటుంబానికి రోజుకు 30 లీటర్ల తాగు నీటిని ఇస్తుంది. దీని ప్లగ్ ను సాధారణ మెషిన్ లాగ పవర్ సప్లై కి కనెక్ట్ చేస్తే చాలు మనకి తాగు నీరు లభిస్తుంది. ఇంకా దీనిలో వేడి నీరు, చల్లని నీరు అందించగల సౌకర్యం కూడా వుంది. ఈ రెయిన్ టన్నెల్ టెక్నాలజీ ద్వారా లభించే నీటి ధర లీటరుకు ఒక్క రూపాయి కన్నా తక్కువ. సహజంగా ఇటువంటి పరికరాలు ఎంతో విద్యుత్ శక్తిని వినియోగిస్తుంటాయి. కాని ఇది అటువంటిది కాకపోవడం విశేషం.

RC_1

ఈ టెక్నాలజీ పేటెంట్ చేయబడింది. మరో రెండు నెలల్లో మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పుడు ఈ టన్నెల్ సామర్ధ్యాన్నివాణిజ్య అవసరాల కోసం రోజుకు 100, 500 మరియు 1000 లీటర్లకు పెంచారు. అలాగే దీని సామర్ధ్యాన్ని రోజుకు 10000 లీటర్లకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే వ్యవసాయ అవసరాలకు సైతం దీనిని ఉపయోగించవచ్చు.

ఇసుక లో నుంచి నూనె తీయడమనే సామెత బహుసా ఇటువంటి వారి గురించే పుట్టి వుంటుంది కదూ.

Courtesy