టీచర్/లెక్చరర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సోషల్(Telangana Social), ట్రైబల్ వెల్ఫేర్(Tribal Welfare), ఏకలవ్య(Ekalavya) రెసిడెన్షియల్ విద్యాసంస్థలు(RI) శుభవార్త చెప్పాయి. ఆయా విద్యాసంస్థలు తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Telangana Government Jobs) జారీ చేసింది.
తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ పాటు ఐఐటీ- జేఈఈ (మెయిన్/ అడ్వాన్స్డ్), నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ(Senior Faculty)కి సహాయంగా పార్ట్ టైం(Part time) సబ్జెక్ట్ అసోసియేట్(Associate) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఈ ఉద్యోగాలకు అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో(Online) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న మొదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను చివరి తేదీ(Last date)గా నిర్ణయించారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 31న రాత పరీక్ష ఉంటుంది. తరువాత వచ్చే నెల 8న (ఆగస్టు 8) డెమో(Demo)/ఇంటర్వ్యూ(Interview) ఉంటుంది. ఇందులో మెరిట్ సాధించిన వారికి ఆగస్టు 10 లోగా పోస్టింగ్(Posting) ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్టయినా వారికి నెలకు రూ.25000 వేల ఫిక్స్డ్ వేతనం(Fixed Salary) ఉంటుంది. పూర్తి వివరాలను https://www.tswreis.ac.in/ వెబ్సైట్(Website) చూడొచ్చు.
ఉద్యోగ ఖాళీలు
మొత్తం ఖాళీలు: 149
మాథ్స్ – 26
ఫిజిక్స్ – 29
కెమిస్ట్రీ – 32
బోటనీ – 30
జువాలజీ – ౩2
విద్యార్హతల వివరాలు:
- అభ్యర్థులు బీఈడీ(B.ED)తో పాటు తప్పనిసరిగా పీజీ(PG) చేసి ఉండాలి.
- జేఈఈ మెయిన్స్(JEE Mains)/అడ్వాన్స్డ్(Advanced), నీట్(Neet), ఎంసెట్ టీచింగ్(Eamcet Teahcing) అనుభవం ఉండాలి.
- జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్ లో మంచి స్కోర్(Score) సాధించిన విద్యార్థులకు టీచింగ్(Teaching) చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది
- ఒక్కో అభ్యర్థి ఒక్కో సబ్జెక్టు(Subject)కు మాత్రమే అప్లై చేయాలి.