కార్పొరేట్‌ జాబ్స్(corporate jobs) కోరుకునే వారికి శుభ వార్త. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (NQT) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా డిసెంబర్ 2021, మార్చి 2022 సెషన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. కార్పొరేట్ సంస్థ ల్లో ఉద్యోగాలు కోరుకునే వారి కోసం వేర్వేరు అంశాలపై వేర్వేరు పరీక్షల్ని నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే పరీక్ష రాయొచ్చ. లేదా సమీపంలో ఉన్న టీసీఎస్ ఐయాన్ ఆథరైజ్డ్ పరీక్ష సెంటర్‌లో రాయచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు, ఫీజు, ఎగ్జామ్‌ టాపిక్స్,తదితరాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్య సమాచారం                                                                                                             

ఎగ్జామ్ సెషన్స్: డిసెంబర్ 2021, మార్చి 2022

విద్యార్హతలు: డిగ్రీ, పీజీ, డిప్లొమా లో ఉత్తిర్ణులయ్యి ఉండాలి. ప్రీ-ఫైనల్, ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు ఏ కోర్సు చదువుతున్న నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌(NQT)కు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం

  • మొదట https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలోనే టాపిక్స్ వివరాలు ఉంటాయి.
  • మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • ఆ తర్వాత మీరు రాయాలనుకునే టాపిక్‌కు సంబంధించిన టెస్ట్ ను ఎంపిక చేసుకోవాలి.
  • ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి సబ్‌మిట్‌ .బటన్ క్లిక్ చేయాలి..

ఎగ్జామ్ టాపిక్స్, ఫీజు వివరాలు ఇవే:

కాగ్నిటీవ్ స్కిల్స్- రూ.599

ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రీ- రూ.399

యాటిట్యూడినల్ అలైన్‌మెంట్ (సైకోమెట్రిక్ టెస్ట్)- రూ.399

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ- రూ.399

అకౌంటెంట్- రూ.399

ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్- రూ.399

డిజిటల్ మార్కెటింగ్- రూ.399

కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్- రూ.399

ఐటీ ప్రోగ్రామింగ్- రూ.399

బేసిక్ కంప్యూటర్ స్కిల్స్- రూ.399

బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్- రూ.399

బిగ్ డేటా ఆన్ క్లౌడ్- రూ.799

మెషీన్ లెర్నింగ్- రూ.799

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- రూ.799

ముఖ్య సూచిక:

విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగా ఈ అంశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్‌లో పొందే స్కోర్‌ (Score)కు రెండేళ్ల వ్యాలిడిటీ(Validity) ఉంటుంది.

స్కోర్ తక్కువగా ఉన్నవారు తమ స్కోర్‌ను పెంచుకోవడానికి మళ్లీ ఈ ఎగ్జామ్‌ రాసుకోవచ్చు . మంచి స్కోర్ ఉన్నవారు కార్పొరేట్ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే 63 వేలకు పైగా అభ్యర్థులు టీసీఎస్(TCS) నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌(NQT) లో సాధించిన స్కోర్ ద్వారా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు.