ప్రముఖ దిగ్గజ సాఫ్ట్ వేర్(Software) కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రిక్రూట్మెంట్స్(Recruitments) లో దూకుడు చూపిస్తోంది. ఇటీవల ఫ్రెషర్స్ ని నియమించుకోవడం కోసం వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. స్మార్ట్ హైరింగ్(Smart Hiring) 2022, ఎంబీఏ హైరింగ్ (MBA Hiring)2022, ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ (Campus Digital Hiring) 2022 ద్వారా దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. తాజాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్(PG) పాసైనవారిని కూడా ఫ్రెషర్స్(Fresher’s) గా నియమించుకోవడానికి టీసీఎస్ అట్లాస్ హైరింగ్ (TCS Atlas Hiring) ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్(Registration) చేయడానికి ఆఖరు తేదీ ఏమీ లేదు. రిజిస్టర్ చేసినవారికి టెస్టులు(Tests) కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ ప్రోగ్రామ్‌కు ఎవరు అప్లై చేయాలి? అర్హతలేంటీ? ఎలా రిజిస్టర్ చేయాలి? తెలుసుకోండి.
వయస్సు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు
విద్యార్హతలు: 2022, 2021 లో మ్యాథమెటిక్స్(Mathematics), స్టాటిస్టిక్స్(Statistics), ఎకనమిక్స్(Economics) లో ఎంఎస్సీ(M.Sc), ఎంఏ ఎకనమిక్స్(M.A Economics) పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి.2022 లో ఈ కోర్సులు పాస్ అయ్యేవారు అంటే చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.
ఇతర నిబంధనలు: టెన్త్(Tenth), ఇంటర్(Inter), డిప్లొమా(Diploma), డిగ్రీ(Degree), పోస్ట్ గ్రాడ్యుయేషన్(PD)లో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. టెన్త్, ఇంటర్ NIOS ద్వారా పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. రెండేళ్ల లోపు అనుభవం(Experience) ఉన్నా అప్లై చేయొచ్చు.
రిజిస్ట్రేషన్: టీసీఎస్(TCS) అధికారిక పోర్ట(Official Portal)ల్లో రిజిస్ట్రేషన్(Registration) కొనసాగుతోంది.
పరిక్ష తేదీ: బ్యాచ్‌ల వారీగా పరీక్ష నిర్వహిస్తోంది టీసీఎస్. రిజిస్ట్రేషన్ పూర్తైనవారికి పరీక్ష సమాచారాన్ని అందిస్తుంది.
ఇంటర్వ్యూ తేదీ: త్వరలో ప్రకటించనున్న టీసీఎస్.
దరఖాస్తు చేయు విధానం:
- టీసీఎస్ అట్లాస్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి https://www.tcs.com/careers/tcs- atlas-hiring లింక్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీ(Home page)లో వివరాలన్నీ చదివిన తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.
- హోమ్ పేజీలో Register Now పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.
- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్(Registration) చేయాలి.
- వివరాలు సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్(Admission Submit) చేయాలి.
- అప్లికేషన్ స్టేటస్‌లో Application Received అని ఉండాలి.
- ఆ తర్వాత CT/DT ఐడీ(id)తో రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
- https://www.tcs.com/careers/tcs-atlas-hiring వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Apple Here with CT/DT ID పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- ఆ తర్వాత https://www.tcs.com/careers/tcs-atlas-hiring పేజీలో మరో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.