క్యారెట్ (Carrot)వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benifits) కలుగుతాయో అందరికీ తెల్సిందే ! ప్రతిరోజూ (Everyday) క్యారెట్స్ ఆహారం లో తీసుకుంటుటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, జీర్ణశక్తిని మరింతగా వృద్ధి చేస్తుందని డాక్టర్లు (Doctors) ఎప్పుడూ సలహాలు ఇస్తూనే వుంటారు.
కాబట్టి.. ఈ క్యారెట్ తో ప్రత్యేక రెసిపీ (Special Receipe) చేసుకుని ఆరోగ్యం గా ఉండొచ్చు . మరి , అలాగే.. ఈ క్యారెట్’తో ఖీర్, చేయడం ఎలాగో తెలుసుకుందామా ! ఈ క్యారెట్ ఖీర్ కాస్త డిఫరెంట్ స్టైల్లో వుండటంతోబాటు, ఎంతో రుచిగా వుంటుంది.
ఆలస్యం ఎందుకు మరి.. దీన్నెలా చేస్తారో చూసేద్దామా …
కావాల్సిన పదార్ధాలు (Required Ingredients)
- ఒక కప్పు క్యారెట్ తురుము
- 1/2 లీటర్ పాలు
- 2 టీ స్పూన్స్ నెయ్యి
- 25 గ్రాములు డ్రైఫ్రూట్స్
- 100 గ్రాములు కోవా
- 1/2 టీ స్పూన్ యాలకులపొడి
- ఒక కప్పు పంచదార
ఇపుడు తయారు చేయు విధానం (Process) చూసేద్దాం రండి.
- స్టౌవ్ (Stove) మీద ఒక బాణలి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి (Ghee) వేసి కాస్త వేడి ఎక్కించండి . నెయ్యి కాగిన తర్వాత అందులో డ్రైఫ్రూట్స్ (Dry Fruits) ని వేసి కొద్దిసేపటి వరకు బాగా వేయించాలి . అనంతరం క్రిందకు దించేసి దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్’ (Pan) లో ఇంకొంచెం నెయ్యి వేసి , క్యారెట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. ఈ తురుమును కూడా క్రిందకు దించేసి.. ఒక పక్కన వుంచుకోవాలి.
- మరో స్టౌవ్’పై మరొక పాత్ర పెట్టి అందులో కొంచెం పాలు (Milk) పోసి బాగా మరిగించుకోవాలి. ఇపుడు ఈ పాలు మరుగుతుండగానే అందులో కోవావేసి బాగా కలుపుతూ వుండాలి.
- అలా పాలను 10 నిముషాలపాటు ఉడికించిన తర్వాత దానిలో వేయించి ఉంచుకున్న క్యారెట్ తురుమును, పందార ను వేసి మిక్స్ (Mix) చేస్తూ మరో 10 నిముషాలు బాగా వేయించాలి.
- ఇలా వేడి చేసిన తర్వాత క్రిందకు దించేముందు వేయించి ఉంచిన న డ్రైఫ్రూట్స్’తో గార్నిష్ (Garnish) చేసుకోవాలి.
అంతే, చూసారా ఇపుడు నోరూరించే క్యారెట్ ఖీర్ రెడీ! ఇక ఆలస్యం ఎందుకు సర్వ్ చేసేయండి …