కాన్సర్ ఇది ఒక భయానకమైన రోగం. ఇది అలా ఉంచితే ఇది బయటపడటము కష్టమే. అటు పైన దీని వైద్యము ఖర్చు మరియు ఎంతో బాధతో కూడుకున్నది. ఈ కాన్సర్ లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది గొంతు కాన్సర్ గురించి.
సాధారణంగా పొగ తాగే అలవాటు ఉన్నవారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. అయితే ఈ వ్యాధి తీవ్రతను బట్టి వైద్యంలో భాగంగా చాలా మందికి స్వర పేటిక ను తీసేస్తారు. అటువంటి వారు ఆ పైన మాట్లాడలేరు. కానీ వారు తిరిగి మాట్లాడటానికి మళ్ళీ విదేశి Voice Prosthesis ను అమర్చడం ద్వారా వారు తిరిగి మాట్లాడవచ్చు. కానీ ఈ విదేశీ పరికరం సుమారు 25 నుండి 30 వేలు ఖరీదు చేస్తుంది. దీనిని సామాన్యులు భరించడం కష్టం.

అందుకే మన దేశంలో బెంగుళూరు లోని HCG (Healthcare Global Cancer Care Centre) కు చెందిన ఆంకాలజిస్ట్ Dr. Vishal Rao కేవలం 50 రూపాయలకే Aum అనే స్వదేశి Voice Prosthesis ను తయారు చేసారు. దీనిని ఇప్పటికే 30 మందికి అమర్చగా వారి నుంచి సానుకూలమైన ఫలితాలు కనిపించాయి. అంటే, దీనిని అమర్చిన తర్వాత ఆ రోగులు మాట్లాడగలుగుతున్నారు. అయితే ఇక్కడితో ఆయన ఊరుకోలేదు. కారణం ఈ పరికరాన్ని రోగులకు అమర్చడానికి ఆయనకు ఒక చిన్నపాటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పరికరం అయితే అందుబాటు ధరలో తయారు చేయగలిగాము కానీ దీనిని అమర్చేందుకు ఆపరేషన్ కంటే ప్రత్యామ్న్యాయ పద్ధతులను వెతకడం మొదలు పెట్టారు Dr. రావు.

ఈ ప్రక్రియ లో ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లతో తనకు కావాల్సిన విధంగా ఈ Aum Voice Prosthesis ను అమర్చేందుకు వేరే పద్ధతులను అన్వేషించారు. అయితే మధ్యలో ఒకరు ఇదేదో ఇంజనీర్ల పనిలా లేదు, ఎదో ఆడుకునే బొమ్మలా ఉంది అని అన్నారు. అంతే వెంటనే ఆయన కర్ణాటకలోని చన్నపట్న అనే ఒక చిన్న ఊరిలోని బొమ్మల తయారీ దుకాణదారులను వెళ్లి కలిసారు. వారికి తన పరికరం అమర్చాల్సిన విధానాన్ని గూర్చి చెప్పగా అందులో ఒకరు ఇది చాలా సులభమని కావాల్సిన విధంగా బొమ్మలు గీసి చూపిస్తే తగిన కొలతలతో కేవలం రెండే రెండు గంటల్లో ఈ Aum Voice Prosthesis ను అమర్చడానికి కావాల్సిన inserter చేసి చూపించారు. సరే అంత సులువైన పరిష్కారం ఏంటో ఎలా పని చేస్తుందో చూద్దాం.

ఈ inserter కు Dr. రావు సుశ్రుత్ (Sushruth) అని పేరు పెట్టారు. సాధారణంగా ఈ voice prosthesis ను ఒక ఆపరేషన్ ద్వారా గొంతులో అమర్చుతారు. కానీ ఈ inserter ద్వారా నిముషాల్లో ఎలాంటి ఆపరేషన్ లేకుండానే తక్కువ ఖర్చు అసలు ఎలాంటి నొప్పి లేకుండా ఇంతటి కీలకమైన పరికరాన్ని గొంతులో అమర్చవచ్చు. ఈ inserter లో మూడు భాగాలు ఉంటాయి. 1. పిస్టన్ 2. సిలిండర్ 3. కోనికల్ ట్యూబ్. ఈ ట్యూబ్ లోనే voice prosthesis ను అమర్చుతారు. ఇది మన ఇంజక్షన్ లానే పని చేస్తుంది. సిలిండర్ కు అమర్చిన ట్యూబ్ లోని పరికరo, ఈ సిలిండర్ కు అడుగున ఉన్న పిస్టన్ ను వత్తడం ద్వారా రోగి గొంతులోకి చేరిపోతుంది.
ఈ inserter మొత్తం చెక్కతో తయారు చేయబడటం విశేషం.

ఇంతటి కీలకమైన పరికరాన్ని అమర్చడానికి ఇంతటి సులువైన పరిష్కారం చూపించడం నిజంగా అభినందనీయం కదూ.

Courtesy