బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) హౌస్ లో 5 మంది కంటెస్టెంట్స్(Contestants) మాత్రమే వున్నారు.
ఇక 103వ ఎపిసోడ్ లో ఎప్పటిలాగానే షణ్ముఖ్, సిరి కబుర్లు చెప్పుకున్నారు. వారిద్దరిది అదో లోకం, బిగ్ బాస్ లో ఇంకా రెండు రోజులు వుంది. అయినా వారి ధోరణిలో ఎలాంటి మార్పు లేదు.
మానస్ అన్నట్టు వీళ్ళు కంటెంట్(Content) మాత్రమే ఇవ్వడానికి వాచినట్టు అనిపిస్తుంది. సిరి నాకు పడిపోయావ్ కదా అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని సోది డిస్కషన్ మొదలెట్టాడు షణ్ను. అయితే సిరి మాత్రం నీకంత సీన్ లేదులే అంటూ ఖరాకండిగా చెప్పేసింది. తర్వాత బిగ్‌బాస్ ఆడియెన్స్(Audience) ని బాగా ఎంటర్టైన్(Entertain) చేసిన కొన్ని టాస్క్(Task) లు కంటెస్టెంట్స్ తో మళ్ళీ ఆడించాడు.
అందులో భాగంగా పాత టాస్కులను మరోసారి ప్రవేశపెట్టాడు. మొదటగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో షణ్ను గెలవగా దానిపై అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. లేబుల్ లేదు మచ్చా అనే రెండో టాస్కులో స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున్న టీషర్ట్ వేసుకుని పూల్‌లో దూకి మరోవైపున్న టీ షర్ట్ వేసుకోవాలి. ఇలా ఎవరెక్కువ టీ షర్ట్స్ వేసుకుంటే వారే విజేత గా నిలిచినట్టని తెలిపారు. ఈ గేమ్‌లో మానస్, షణ్ముఖ్ పోటీపడగా మానస్ విన్(Win) అయ్యాడు..
తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక సన్నీ, శ్రీరామ్, మానస్ కాసేపు బంతి ఆట(Ball Game) ఆడుకున్నారు . ఈ క్రమంలో వారి బంతి ఇంటి కప్పు పై పడటంతో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు.
ఇంతలో బిగ్‌బాస్(Big Boss) వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ హౌస్లోపలకు వెళ్లమని హెచ్చరించాడు. అంతేకాదు బిగ్‌బాస్ ఇంటిపై ఎక్కాలని ప్రయత్నించడం ఏమాత్రం సహించబడదని వార్నింగ్(Warning) ఇచ్చాడు. దీనికి ఫలితంగా మీ ముగ్గురూ కలిసి గార్డెన్ ఏరియా(Garden Aera)ను శుభ్రపరచాలని పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో వేరే మార్గంలేక శ్రీరామ్, మానస్ అంతా క్లీన్ చేయగా సన్నీ శుభ్రం చేస్తున్నట్లు నటించాడు. తరువాత హౌస్ మేట్స్(House mates) కి 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్ ఇచ్చాడు.
హౌస్మేట్స్ అంతా తీక్షణంగా క్షణాలను లెక్కిస్తున్న సమయంలో బిగ్‌బాస్ వారిని డిస్టర్బ్(Distrub) చేసేందుకు ప్రయత్నించాడు. ఈ గేమ్‌లో షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్(First Place)లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు.
తర్వాత సిరి, షణ్ను ఒకరిగురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు.’నువ్వు కరెక్ట్ అని నమ్మాను, మన రిలేషన్(Relation)కు నేనిచ్చే గౌరవం అది. కొన్నిసార్లు కంట్రోల్ అయ్యాను, ఎందుకనేది బయటకు వెళ్లాక చెప్తాను అని సస్పెన్స్‌లో పెట్టింది సిరి.
షణ్ను మాత్రం మనం బాగా కనెక్ట్ అయిపోయాం. అప్పుడప్పుడు నువ్వు జెన్యూన్ కాదేమో అనిపిస్తుంది, కాకపోతే అది కోపంలో ఉన్నప్పుడు అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత బిగ్‌బాస్ నాలుగో టాస్క్ లో కొన్ని శబ్ధాలు ప్లే చేయగా అవేంటో రాయాలన్నాడు. ఈ గేమ్(Game)లో బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా రాయడంతో బిగ్ బాస్(Big Boss) ఎలుకకు, కప్పకు వున్నా లింక్ ఏంటో చెప్పమనగా అందరూ తెగ నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్ గెలిచాడు.
ఐదో టాస్కు(Task)లో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ విజేతగా నిలిచాడు. ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట సన్నీ అనడం నచ్చలేదు.
నువ్వే ఓడిపోయావ్, షణ్ను ఒక్కడే కరెక్ట్ గా ఆడాడని రివర్స్ లో పంచ్(Punch) ఇచ్చింది. నేను జోక్‌గా అన్నానని సన్నీ అనగా ఓడిపోయావన్న మాట సరదా కాదని వరించింది. మజాక్‌గా అన్నానని సన్నీ ఎంత సర్దిచెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా అలిగి కూర్చుంది.
ఎవరైనా పక్కవాళ్ళు గెలిస్తే సహించలేడంటూ కోపంతో మండిపడింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్(Warning) ఇచ్చింది. సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్(Imitate) చేయగా సిరి మరింతగా ఆవేశంతో ఊగిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్ చేయదు నువ్వెవడివి ఆలా చేయడానికి అంటూ గొడవ(Fight)కు దిగింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? తోపు అని ఫీలవుతున్నావా? అంటూ కడిగిపడేసింది మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిరుబుర్రులాడింది.
సన్నీ, మానస్‌తో మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే’ అని స్పష్టం చేశాడు సన్నీ.
మరి వీళ్ల రచ్చ ఇలాగే కంటిన్యూ(Continue) అయిందా? లేదా శుభం కార్డ్(End Card) పడిందా? అన్నది రేపటి ఎపిసోడ్(Episode)లో ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే .