బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) ఆరు వారాలు ముగిసి, ఏడో వారం లోకి అడుగుపెట్టింది.ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా అందులో ఐదుగురు అమ్మాయిలే వున్నారు.
ఇక ఈ వారం ఎలిమినేషన్(Elimination)కి జరిగే నామినేషన్(Nomination) ప్రక్రియ ను బిగ్ బాస్ చాలా వైవిద్యంగా, కొత్తగా ప్లాన్ చేసారు.
మరి ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో నిన్నటి 44వ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
ఇక ఈ వారం ప్రక్రియ లో జంగల్ థీమ్ తో వచ్చిన బిగ్ బాస్(Big Boss). వేటగాళ్లుగా సన్ని, జెస్సీ, శ్రీరామ్‌లను ఎంపిక చేసిన బిగ్ బాస్. బయట మిగిలిన హౌస్ మేట్స్ ఫొటోస్ ని అతికించి ఉన్న మంకీ బొమ్మల్ని సేవ్ ట్రీకి వేలాడదీశారు.
వేటగాళ్లు ముగ్గురూ తమకు కేటాయించిన డేరాలో నుంచి బయటకు వచ్చి కోతుల్ని చంపి నామినేట్ చేయడం. కంటెస్టెంట్స్(Contestants) నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ గురించి తగ్గిన కారణాలతో నామినేట్ చేయాలి. అంటే ఇతరుల్ని నామినేట్ చేసేట్టు చేయడం.
ముగ్గురు వేటగాళ్లలో ఎక్కువ సార్లు డేరా గేట్లు నుంచి బయటకు వచ్చి, ఎక్కువ కోతుల్ని వేటాడి నామినేట్ చేసిన వేటగాడు సేవ్ అవుతారు. మిగిలిన ఇద్దరూ నామినేట్ అవుతాడు.
అలాగే జంగిల్ సౌండ్ వచ్చిన ప్రతిసారి గార్డెన్ ఏరియాలో పెట్టిన రెండు అరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరూ అయితే ఆ అరటి పండ్లను తీసుకుంటారో వాళ్లు వేటగాడితో చర్చించి. ఒకర్ని నామినేట్ అయ్యేలా ఒప్పించవచ్చు అనేది ఈ టాస్క్ సారాంశం.
అయితే ముందుగా జంగిల్ సౌండ్ రాగానే షణ్ముఖ్, సిరిలు అరటి పండ్లను తీసుకున్నారు. అలాగే ఫస్ట్ జబర్ రాగానే డేరా నుంచి ఫస్ట్ సన్నీ బయటకు వచ్చాడు. అయితే సిరి, షణ్ముఖ్ ఇద్దరూ కూడా ఆనీ మాస్టర్ని నామినేట్ చేయాలని సన్నీతో డిస్కషన్ చేసారు. వారి అభిప్రాయంతో సన్నీ ఏకీభవించడంతో ఆనీ మాస్టర్ నామినేట్ అయ్యింది.
అయితే నామినేషన్స్(Nominations) అయిన తరువాత కాజల్ వచ్చి సిరి మిమ్మల్ని నామినేట్ చేసింది ఆమెకు మొన్న మీరు వరస్ట్ పర్ఫామెన్స్(Worst Performance) ఇవ్వకుండా నాకు ఎలా ఇస్తారు అని అడగడంతో నీ దగ్గర నెగిటివ్ వైబ్స్ ఉంటాయి.
ఆమె దగ్గర అవి లేవు అని చెప్పింది. అనంతరం లోపలికి వచ్చిన తరువాత అసలు కాజల్ చదువుకున్నదా? లేదా?? నామినేట్ అయ్యి నేను బాధలో ఉంటే మళ్లీ నా దగ్గరకు వచ్చి డిస్కషన్ పెడుతుంది, గెలకడం బాగా అలవాటు ఆమెకు నొప్పిలో ఉంటే గుచ్చుతుంది.. ఈసారి కత్తి తీసుకుని వెళ్లి ఇచ్చేస్తా పొడిచెయ్ అని అంటుంది.
ఆ తరువాత కూడా బజర్ మోగేసరికి బనానా సిరి, ఆనీ మాస్టర్లు తీసుకుంటారు. ఆనీ మాస్టర్ సిరిని నామినేట్ చేయగా, సిరి మానస్‌ని నామినేట్ చేసింది.
అయితే సిరి చెప్పిన కారణం ఒప్పుకోకపోవడం తో సన్నీ ఆనీ మాస్టర్ కారణంతో సమ్మతిస్తూ సిరిని నామినేట్ చేసి, సిరి ఫొటోతో ఉన్న కోతిని కట్ చేసి నామినేట్(Nominate) చేశాడు.
అయితే మూడోసారి కూడా సన్నీ డెన్‌లో నుంచి దూసుకుని బయటకు వచ్చాడు.మూడో సారి అరటిపండు కూడా సిరికే దక్కింది. అయితే ఎలాగూ నేను చెప్పిన వాళ్లని సన్నీ నామినేట్ చేయడని, చర్చలు మొదలుపెట్టింది.
అయితే మళ్లీ అదే కారణంతో మానస్‌ని నామినేట్ చేసిన సిరి, నా నామినేషన్‌ని యాక్సెప్ట్ చేయలేదు అందుకే మళ్లీ చేస్తున్నా అని చెప్పింది. నువ్వు ఖచ్చితమైన కారణం చెప్పలేదు అని సన్నీ చెప్పాడు. తరువాత సిరితో పాటు కాజల్ కూడా అరటి పండుని అందుకోవడంతో ఆమె ప్రియని నామినేట్ చేసింది.
సంచాలక్‌గా ఏం పీకారు అని అనడం నాకు నచ్చలేదని కాజల్ తగిన కారణం చెప్పడంతో సన్నీ సిరి నామినేషన్‌ని పట్టించుకోకుండా కాజల్ నామినేషన్ ని యాక్సెప్ట్ చేసి చెట్టుకు ఉన్న ప్రియ కోతి బొమ్మని కట్ చేసి ప్రియని నామినేట్ చేశాడు.
అయితే సిరి సన్నీ మళ్లీ రిజెక్ట్ చేయడంతో వేటగాళ్లలో మిగిలిన ఇద్దరు ఎందుకు? కూర్చుని ఉండమను ఇప్పటికే సన్నీ మూడుసార్లు వచ్చాడు అని చెప్పి కోప్పడింది.
గేమ్ అంత సన్నీ ఆడుతున్నట్టు వుంది. మిగిలిన ఇద్దరి వేటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా మొత్తం గేమ్ తనకు నచ్చినట్టు అడిస్తున్నాడు సన్నీ.
ఇక నాలుగోసారి కూడా డెన్ నుంచి సన్నీ బయటకు వచ్చాడు. అరటిపళ్లు సిరి, ప్రియలకు దక్కాయి. అయితే ఈసారి సిరి.. తన అరటిపండుని ప్రియాంకకు ఇచ్చింది. ప్రియాంక తీసుకుని కాజల్‌ని నామినేట్(Nominate) చేయగా. ఇలా కూడా ఇవ్వొచ్చా అని అడిగాడు సన్నీ. తీసుకోవచ్చు అని చెప్పింది ప్రియాంక.
రెండో అరటిపండు అందుకున్న ప్రియ రవిని నామినేట్ చేస్తూ రవి సోఫాలో టవల్ ఆరేయడం నాకు నచ్చడం లేదని సిల్లీ రీజన్ చెప్పింది. అయితే ప్రియ,కాజల్‌ని ప్రియాంకతో నామినేట్ చేయించాలనే ఇలాంటి సిల్లీ రీజన్ చెప్పడంతో సన్నీ ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
మీరు నాతో గేమ్స్ ఆడుతున్నారు కదా శ్వేతా వెళ్లిపోతూ తాను ఎంత పెయిన్ అనుభవించిందో చెప్పింది. అందుకే ప్రియ రీజన్‌ని యాక్సెప్ట్(ACCEPT) చేసి రవిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు సన్నీ.
ఆ మాట చెప్పగానే ప్రియ, ప్రియాంకలకు కోపం తో ఊగిపోయారు. ఇలాంటి సిల్లీ రీజన్స్(Silly Reasons) కి నామినేట్ చేస్తారా? అని మండిపడ్డారు. ఇక రవి కూడా అరేయ్ ఏంట్రా ఇది, శ్వేతకి నేను సారీ చెప్పాను ఇది నా లైఫ్‌రా ఇలాంటి వాటికి నామినేట్ చేస్తావా? శ్వేతా నా వల్ల నామినేట్ అయ్యిందా? అని నిలదీశాడు రవి.
సిల్లీ రీజన్ ఇచ్చి గేమ్స్ నాతో ఆడాలనుకున్నారు.. అసలు గేమ్ నేను ఆడాను ఇది ఫైనల్ అని ప్రియా గట్టిగానే కౌంటర్ ఇచ్చిన సన్నీ. అయితే ప్రియ దమ్ముంటే నా ముందు మాట్లాడు నీకు ధైర్యం లేదంటూ సన్నీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
ఐదోసారి కూడా సిరికి బనానా దక్కడంతో మళ్లీ తీసుకుని వెళ్లి ప్రియాంకకి ఇచ్చింది. ప్రియాంక మళ్లీ కాజల్‌నే నామినేట్ చేసింది. రెండో బనానా రవి అందుకుని కాజల్‌ని నామినేట్(Nominate) చేయడంతో అతని చెప్పిన కారణం తో ఏకీభవిస్తూ కాజల్‌ని నామినేట్ చేశాడు.
మొత్తంగా ఏడోవారం నామినేషన్స్‌లో యాని, సిరి,కాజల్, రవి, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లు నామినేట్ అయ్యారు. వేటగాళ్లుగా ఉన్న శ్రీరామ్, జస్వంత్‌లు ఒక్కసారి కూడా డెన్ నుంచి బయటకు రాకపోవడంతో వారు నేరుగా నామినేట్ కాగా, కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియలను సన్నీ వేటాడి నామినేట్ చేశాడు.
అయితే ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడని బిగ్ బాస్(Big boss) లోబో తో చెప్పాడు. దీంతో ఈవారం నామినేషన్స్(Nomination) లో 8 మంది నిలిచారు.
ఈ నామినేషన్ ప్రక్రియ లో సన్నీ, ప్రియా నే హైలైట్ గా నిలిచారు.