బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5), 73 వ ఎపిసోడ్ కెప్టెన్(Captain) పోటీదారుల టాస్క్(Task) లో సన్నీకి పవర్ టూల్(Power tool) పొందుతాడు. రెండు కవర్లు ఇచ్చి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుని పవర్‌ని ఉపయోగించమని చెప్తారు బిగ్ బాస్(Big Boss).
సన్నీ ఎంచుకున్న కవర్లో ఒక హౌస్ మెట్ (House mates)దగ్గర నుంచి ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని ఉండటంతో సిరి దగ్గర ముత్యాలను తీసుకుని మానస్‌కి ఇస్తానని చెప్పాడు. అయితే షణ్ముఖ్ మన మధ్య గ్యాప్ ఉంది.
మామా, బ్రిడ్జ్ కట్టెయ్ అని షణ్ముఖ్ అనడంతో తన నిర్ణయం మార్చుకుంటూ సిరి దగ్గర తీసుకుని షణ్ముఖ్‌కి ఇస్తాడు. దీంతో షణ్ముఖ్ సన్నీకి హగ్ ఇస్తూ బ్రిడ్జి కట్టేశావు అని అంటాడు. అయితే సిరి మాత్రం మొహం ఏదోలా పెట్టుకుని నేను ముందే ఎక్స్ పెక్ట్ చేశా అని అన్నది.
మొదటి రౌండ్లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ విజేత(Winner) గా నిలిచింది.
ఇక అడ్డదారిలో టాస్క్(Task) ఎలా గెలవాలన్నదానిపై ఆరితేరిపోయిన సిరి, అడ్డదారిలో పోతూ హౌస్ మేట్స్(House mates) మధ్య చిచ్చు పెడుతుంది.
ఈరోజు టాస్క్ లోనూ అదే స్ట్రాటజీ(Strategy) ఉపయోగించింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే, సిరి రవి కాయిన్స్ ని కొట్టేసింది. అది చూసిన షణ్ముఖ్. వరస్ట్ రా నువ్వు అన్నీ దొబ్బుడే నీకంటే నేనే బెటర్ వాళ్లు నీపై పడిపోతారు నేను కాపాడాలి అని షణ్ముఖ్ అంటే గేమ్ రా అని నవ్వుకుంది సిరి.
ఆ తరువాత మెల్లగా కాజల్ బౌల్ నుంచి కాయిన్స్(Coins) కూడా దొబ్బేసింది సిరి. ఇక కాజల్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన గోల్డ్ మైన్(Gold Mine)లోని కాయిన్స్ నొక్కేసి తరువాత బిగ్ బాస్(Big Boss) ఎక్కడ డిస్ క్వాలిఫై(Qualify) చేస్తాడన్న భయంతో మళ్లీ తిరిగి అందులోనే పడేసింది.
ఆ తరువాత రవి సిరి తో నిన్ను ఏమైనా మాటలు అన్నాడా? నునువ్వు వు ఎందుకంత రియాక్ట్ అయ్యావు అని అడిగాడు. సిరి నవ్వుతూ ఇద్దరికీ బాగా ఎమోషనల్ కనెక్షన్(Emotional Connection) వచ్చేసింది. వాడి తప్పే కాదు, నాది కూడా ఉంది, అని అన్నది. మరి షణ్ముఖ్ నాదే తప్పు అంటున్నాడు ఏంటి? అని రవి అంటే సిరి తెగ మురిసిపోయింది.
దీంతో రవి మీరిద్దరూ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది మీ ఇద్దర్నీ చూస్తే ఒకరికోసం ఒకరు ఏం చేసుకోవడానికైనా సిద్ధమైనట్టు అనిపిస్తుంది. కొంచెం ఎక్కువగానే అని రవి అంటే అదేం లేదు వాడు బాగా ట్రిప్ అవుతున్నాడు.. అంతే అని సిరి చెప్పగా కేవలం నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో అది ఆలోచించు.
నీకు అర్థమౌతుంది మీరే ఆలోచించుకోండి’ అంటూ రవి సిరికి అడ్వైజ్(Advice) చేసాడు.
తర్వాత శ్రీరామచంద్ర పవర్ రూమ్ యాక్సెస్ పొందడం తో ఓ పవర్(Power) వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. ముప్పై బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్(Big Boss) ఆదేశించాడు.
తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో ఓ ప్లాన్ ప్రకారం శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడంతో హౌస్ మేట్స్(House mates) షాక్ అయ్యారు.
రెండో రౌండ్లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్‌లో నిలిచారు. దింతో వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ(Captaincy) కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే సిరి ఈ టాస్క్ లో కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతోందని చెప్పడంతో, సిరి తరపున వేరొకరు ఛాలెంజ్(Challenge)లో పాల్గొనాలంటూ మెలికపెట్టాడు ఇచ్చాడు.
దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్‌ను చేశాడు.
అయితే ఈ గేమ్ రూల్స్(Rules) తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద మండిపడ్డాడు సన్నీ. అలాగే మానస్, కాజల్ మీద కూడా చిరుబుర్రులాడాడు. రవి గేమ్ గురించి తాను చేసిన తప్పు గురించి వివరిస్తున్న మాట్లాడకుండా రవి తో కూడా వాగ్వాదానికి దిగాడు.
తన్నుకొస్తున్న కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్(Swimming pool)లో దూకాడు.
ఇది హౌస్‌లో నుంచి యానీ మాస్టర్ చూడగా సన్నీ మూగబాష లో సంభాషించాడు. ఈ ఒత్తిడి నా వల్ల కాదన్నట్లు ఫేస్ పెడుతూ సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చేతితో గన్ పేల్చుకుని నీళ్లలో పడిపోయాడు.
ఇక గురువారం ప్రోమో(Promo)లో కాజల్ సన్నీ మీద అలిగినట్టు కనిపిస్తుంది.
ఇక సన్నీ ఇంకోసారి గ్రూప్ అనమను చెప్తా అంటూ కనిపించాడు. మరి ఆ రచ్చ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే……..