https://youtu.be/JU1rw3RRzLY
ఏ ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నప్పటికీ అందులో గాలి, వెలుతురు, అదే సూర్య కాంతి బాగా వస్తేనే ఆ ఇంట్లో సుఖంగా ఉండగలం. ఒకప్పుడు పట్టణాలు, పల్లెల్లో సైతం పెద్ద పెద్ద ఇళ్ళు, ఇంటిలోని ప్రతీ గదికి కిటికీ ఉండడంతో గాలి వెలుతురూ ధారాళంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవనాలు (అపార్ట్ మెంట్), అయిదు అంతస్తులకు దాటిపోయి భవన నిర్మాణాలు జరగడం వల్ల పాపం సూర్యుడు ఆయన పని ఆయన చేస్తున్నా ఇంట్లోకి సరిగ్గా గాలి వెలుతురూ రాకపోవడం చాలా మందికి అనుభవమే కదూ.
ఇంట్లో ఏ ఒక్క గదికో సూర్య కాంతి వస్తుంది, మిగతా అన్ని గదులూ పగలే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. అపార్ట్ మెంట్ లలో ఉండే వారికి ఖచ్చితంగా ఎదో ఒక గదిలో ఈ లోటు కనిపించక మానదు. సరే మన పరిస్థితే ఇలా ఉంటే ఇక పాశ్చాత్య దేశాల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. కొన్ని దేశాల వారికి అసలు ఏడాదిలో ఎక్కువ ఎండే రాదు. ఇందువల్ల మన విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతోంది. పగలే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితిని నివారించడానికి వచ్చేసింది Sunlight LED Window.
పేరుకు తగ్గట్టే ఇది చూడడానికి కిటికీ లానే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీనిని ఉపయోగించడానికి ఎలాంటి యాప్ లు సెన్సర్లు అవసరం లేదు. దీనిలో కేవలం ఒక విండో సెన్సర్ మరియు LED విండో ఉంటాయి. ఈ సెన్సర్ ను మన ఇంట్లో ఏదైనా సూర్య కాంతి వచ్చే కిటికీకి అంటిoచి, మనకు సూర్య కాంతి కావాల్సిన గదిలో ఈ Sunlight LED Window ను తగిలిస్తే చాలు, రెండే నిముషాల్లో ఆ సెన్సర్ లోని కాంతి ఈ LED Window ద్వారా ఇంట్లో ప్రతిఫలిస్తుంది. ఈ వీడియో లో ఈ LED Window అంటించిన తరువాత గదిలో కలిగిన తేడాను తేలిగ్గా గుర్తించవచ్చు.
ఈ Sunlight LED Window ధర $249. దీంట్లోనే ఈ LED Window తో పాటు Sunlight Mini అనే చిన్న కిటికీ సైతం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ సంవత్సరాంతం లోపు ఇది అందుబాటులోకి రావచ్చు అని ఈ సంస్థ స్థాపకులు Craig Proudley అంటున్నారు.