స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) నుంచి మరో నోటిఫికేషన్ రిలీజయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4500 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో లోయర్ డివిజన్ క్లర్క్(LDC) లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO) విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎల్డీసీ పోస్టులకు జీతం రూ.19,900 నుంచి రూ.63,200 మధ్య చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు జీతం రూ.25,500 నుంచి రూ.81,100 మధ్య చెల్లించనున్నారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Recruitment Drive) ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.DEO(Data Entry Operator)పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్(Science Stream) నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా.. విద్యార్థి 12వ తరగతిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.SSC CHSL ఎగ్జామ్‌కు అప్లికేషన్ ఫీజు(Application Fee) రూ. 100. అయితే మహిళలు, SC, ST, శారీరక వికలాంగులు (Physically Handicapped) లేదా మాజీ సైనికుల(EX-Solider)కు ఎలాంటి ఫీజు ఉండదు.
వయోపరిమితి: అభ్యర్థుల యొక్క వయస్సు(AGE) జనవరి 01, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి(Age Limit)లో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల(Full Details)కు అధికారిక వెబ్ సైట్(Official Website) ను సందర్శించి తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు ప్రారంభం – డిసెంబర్ 06, 2022
దరఖాస్తులకు చివరి తేదీ – జనవరి 04, 2023
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ – జనవరి 04, 2023
తప్పుడ సవరణకు అవకాశం- జనవరి 09, 2023
టైర్ 1 పరీక్ష తేదీ – ఫిబ్రవరి, మార్చి 2023
టైర్ 2 పరీక్ష తేదీ – త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్..
సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్(CHSL Exam)కు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆధార్ (Aadhar Card) , పాన్ కార్డ్(Pan Card) , పాస్‌పోర్ట్(Password), డ్రైవింగ్ లైసెన్స్(Driving License) వంటి ఏదో ఒక ఐటీ ప్రూఫ్(IT Proof)ను సిద్ధం చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ కార్డ్ అవసరం. కాస్ట్ కర్టిఫికెట్, 10వ, 12వ తరగతుల మార్క్ షీట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్, అభ్యర్థి సంతకం.. వంటి వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ nic.inకి వెళ్లండి.
- ఆపై హోమ్ పేజీలో “SSC CHSL ఆన్‌లైన్‌లో అప్లై” లింక్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత యూజర్ నేమ్(User Name) అండ్ పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు మరియు ఇతర అవసరమైన పత్రాల(Documents)ను అప్‌లోడ్(Upload) చేయాలి.
- చివరగా అప్లికేషన్ సమర్పించిన తర్వాత అభ్యర్థి దానిని ప్రింట్ అవుట్(Print Out) తీసుకోవాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్
సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్ రెండు విభాగాలుగా జరుగుతుంది. టైర్-I అనేది డిస్క్రిప్టివ్ పేపర్(Descriptive Paper), స్కిల్ టెస్ట్(Skill Test) లేదా టైప్ టెస్ట్(Typing Test). ఈ కంప్యూటర్ బేస్డ్(Computer Based) ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్(Objective Type Exam)లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు టైర్-2కి అర్హులు. టైర్-II పరీక్ష కూడా ఆన్ లైన్ లో ఉంటుంది.