బిగ్ బాస్ సీజన్ 5(Big Boss seasan5) లో పెన్నెండో వారం ఫ్యామిలీ ఎపిసోడ్(Family Episode) ని హౌస్ మేట్స్ తో పాటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది అనే చెప్పాలి. దాదాపు 80 రోజులా తరువాత తమ కుటుంబ సభ్యులతో కాసేపు సమయాన్ని గడపటం తో కంటెస్టెంట్స్ మరింత ఉత్సహంగా కనిపిస్తున్నారు. ఎట్టకేలకు వీకెండ్ షో కూడా మొదలైంది.
వీకెండ్ షో ని మరింత ఎంటర్టైన్మెంట్(Entertainment) తో అలరించడానికి నాగ్ సర్ అదిరిపోయే సర్పైజ్(Surprise) తో వచ్చేసాడు.
ఈ వారం బిగ్ బాస్(Big Boss) హౌస్ లోకి ఫ్యామిలీ మెంబెర్స్ పంపించగా, కంటెస్టెంట్స్(Contestants) క్లోజ్ ఫ్రెండ్స్ ని, ఫామిలీ మెంబెర్స్ ని స్టేజి పైకి పిలిచాడు. దీంతో హౌస్ మేట్స్ మస్త్ ఖుషి అయ్యారు.
వీకెండ్ షో లో కంటెస్టెంట్స్ తో గేమ్స్(Games) ఆడించే బిగ్ బాస్, ఈ సారి స్టేజి మీద కు వచ్చిన ఫామిలీ మెంబెర్స్ తో గేమ్స్ ఆడించి ఎవరు టాప్ 5 వుంటారో తమ అభిప్రాయాలను చెప్పమన్నాడు.
అయితే హౌస్ మేట్స్(House mates) వారి తో మాట్లాడాలంటే బంధానికి త్యాగం అనే గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఇష్టమైన వస్తువును త్యాగం చేయాలని ట్విస్ట్(Twist) పెట్టాడు.
బిగ్ బాస్(Big Boss) సీజన్ 5లో చివరి కెప్టెన్(Captain)గా షణ్ముఖ్ సెలెక్ట్ కావడంతో మెచ్చుకున్నారు నాగార్జున. ఇష్టమైన వస్తువుని త్యాగం చేస్తే దాన్ని బట్టి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కలవాలా లేదా అన్నది హౌస్ మేట్స్(House mates) డిసైడ్ చేస్తారని చెప్పారు నాగార్జున. మొదటిగా యాంకర్ రవితో మొదలుపెట్టారు. అయితే రవి తన కూతురు గుర్తుగా ఉంచుకున్న డాల్ని త్యాగం చేశాడు. ఆ త్యాగంకి హౌస్ మేట్స్ అవును అని అనడంతో రవి కోసం వచ్చిన గెస్ట్ ని కలుసుకునే ఛాన్స్(Chance) పొందాడు.
రవి కోసం అతని తల్లి ఉమాదేవి, బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజి కూడా స్టేజ్ మీదికి వచ్చారు. తల్లిని చూసి రవి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజ్ పుత్ రవి రాజా, నా కొడుకు రవి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని చెప్పారు. ఆ తరువాత శివ బాలాజీ, రవి తల్లి టాప్ కంటెస్టెంట్స్(Contestants) ని బోర్డ్ పై పెట్టారు. ఫస్ట్ ప్లేస్ రవికి, రెండో స్థానం సన్నీకి, మూడో స్థానం శ్రీరామ్, నాలుగో స్థానం షణ్ముఖ్ కి, ఐదో స్థానం మానస్‌లకు ఇచ్చారు.
ఆ తరువాత రవి తల్లికి ఒక కవర్ ఇచ్చి ఓపెన్ చేయమన్నారు నాగార్జున. అందులో రవి అన్ సేఫ్(Safe) అని రావడంతో డిజప్పాయింట్ అయ్యారు రవి తల్లి ఉమాదేవి. అయితే ఇలా ఫామిలీ మెంబెర్స్ తో చెప్పించడం అంత కరెక్ట్ గా అనిపించడంలేదు.
తరువాత ప్రియాంక తన మేకప్ కిట్(Makeup Kit) త్యాగంతో ఆమె దగ్గరి వాళ్ళను కలుసుకునే ఛాన్స్ కలిగింది. వారి తో టాప్ ౫ లో ఎవరు వుంటారో చేపమంగా ముందు ప్రియాంక, సన్నీ శ్రీరాం, రవి, మానస్ లు టాప్ 5 లోవుంటారు అని చెప్పి,వాళ్ళతో అన్ సేఫ్ అని చెప్పారు. ప్రియాంక తరువాత సన్నీ వంతు రావడంతో సన్నీ కి ఫ్రెండ్స్ పంపిన ఒక గిఫ్ట్(Gift) ని త్యాగం చేయడంతోతన ఫ్రెండ్స్ వెంకట్, నిఖిల్ వచ్చారు. ఆ తరువాత సన్నీ సేఫ్ చేసి వెళ్లారు.
ఆ తరువాత .సిరి వంతు రావడం తో తనకు కాబోయే భర్త శ్రీహాన్ కానుకగా ఇచ్చిన బ్రేస్లెట్(Bracelet) ను త్యాగం చేసింది. దీంతో నాగ్ ఏకంగా శ్రీహాన్‌ను స్టేజీమీదకు పిలిచాడు. చాన్నాళ్ల తర్వాత ప్రియుడు వస్తుండటంతో సిరి బోరుమని ఏడ్చేసింది. కనీసం తలెత్తి అతడిని చూడలేకపోయింది. దీంతో శ్రీహాన్ నన్ను వదిలేస్తున్నవా? అని సూటిగా ప్రశ్నించగా ఆమె ఏదో తప్పు చేసినదానిలా గుంజీలు తీసింది.
అది చూసి తట్టుకోలేకపోయిన శ్రీహాన్ దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటూ సిరి ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే బాత్రూంలో తల బాదుకుని ఎందుకు గోడలు పగలగొడుతున్నావని సరదాగా ఏడిపించాడు. తరువాత సిరి మాట్లాడుతూ. శ్రీహాన్ షార్ట్ ఫిలిం(Short Film) విడుదలైనప్పుడు తాను గెస్ట్(Guest) గా వెళ్లానని, అక్కడ తన ప్రేమకథకు పునాది పడిందని చెప్పుకొచ్చింది.
కంటెస్టెంట్ల(Contestants) లో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు నాగ్. కాకపోతే సిరి ఫొటో మాత్రం బోర్డుపై మొదట పెట్టడానికి వీల్లేదన్నాడు. దీంతో మరో ఆప్షన్ లేకపోవడంతో అతడు సన్నీని టాప్ 1 లో పెట్టి షణ్నును రెండో స్థానంలో ఉంచాడు. సిరి పక్కన తాను లేకపోయినా ఆమెకు తోడుగా ఉంటూ రక్షిస్తున్నందుకు షణ్నుకు థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత యాంకర్ రవిని మూడో స్థానంలో, శ్రీరామ్‌ను నాల్గో పొజిషన్లో ఉంచాడు. తర్వాత అతడో సీక్రెట్ విషయాన్ని పంచుకున్నాడు. నేనొకర్ని ప్రేమిస్తున్నాను, రెండు రోజుల క్రితమే ప్రపోజ్ చేశాను.
మెసేజ్ కూడా పెట్టానంటూ సిరి గుండెల్లో గుబులు రేపాడు. అటు నుంచి థ్యాంక్స్ యూ శ్రీహాన్ మామా అని రవి కూతురు వియా రిప్లై ఇచ్చిందని చెప్పడంతో అక్కడున్న అంతా నవ్వేశారు. సిరిని అతి చేయకంటూ ఐదో స్థానంలో ఉంచుతూ ఆమె కోసం పాటందుకున్నాడు. చివరగా మీలో మీరు కొట్టుకు చావండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్(Entertain) చేయండని చెప్తూ సిరిని సేఫ్(Safe) చేసి వెళ్లాడు.
మానస్ బ్రాస్లెట్ త్యాగం చేయడంతో మానస్ వాళ్ళ నాన్నగారు, ఫ్రెండ్ అమరదీప్ వచ్చారు. ఇక టాప్ 5 లో ఎవరు అన్నగా మానస్, సన్నీ, కాజల్, శ్రీరామ్, షన్ను ఉంటారని, అలాగే సన్నీ ని సేఫ్(Safe) చేసి వెళ్లారు. తరువాత కాజల్ తన దగ్గర వున్న డాల్ ని ఇవ్వగా ఆమె చెల్లి, సింగర్ లిప్సిక వచ్చారు. ఇక వాళ్ళు కాజల్, సన్నీ, షన్ను, శ్రీరామ్, మానస్ లు టాప్ 5 అని చెప్పారు. లిప్సిక చేతుల మీదుగా కాజల్ అన్ సేఫ్(Unsafe) అయింది. ఇక శ్రీరామ్ వంతు రాగా హమీద ఇచ్చిన బ్రోచ ని త్యాగం చేయడంతో అతని తల్లి, ఫ్రెండ్ వచ్చారు. ఇక టాప్ 5(Top 5) లో శ్రీరామ్, రవి, ప్రియాంక, సన్నీ, షన్ను లు వున్నారు అని చెప్పారు. ఇక శ్రీరామ్ సేఫ్ అని ప్రకటించిన అతని తల్లి.
ఇక ఫైనల్ గా షన్ను వంతు రావడంతో అతను దీప్తి ఇచ్చిన టి షర్ట్(Tshirt) త్యాగం చేయడంతో షన్ను వాళ్ళ అన్న స్టేజి మీదకు వచ్చాడు. దింతో షన్ను డిసప్పోయింట్(Disappoint) అయ్యాడు. అయితే అంతలోనే దీప్తి ఎంట్రీ ఇచ్చి అతని మూడ్‌ను మార్చేసింది. దీప్తిని చూడగానే షన్ను తెగ సంబరపడిపోయారు .
దీప్తి ‘సచ్చినోడా నిన్ను చాలా మిస్సయ్యాను’ అంటూ చెప్పగా షణ్నూ కాస్త ఎమోషనల్(Emotional) అయ్యాడు. ఇక టాప్ 5 లో షన్ను,శ్రీరామ్, సన్నీ,రవి, మానస్ లు ఉంటారని తెలిపారు.
ఇక దీప్తి చేతుల మీదుగా షన్ను ని సేఫ్ చేసింది. ఇకనైనా దీప్తి సునయన ఎంట్రీతో షణ్నూ గేమ్ ని స్ట్రాంగ్(Strong) గా ఆడుతాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే సిరి-షణ్నూల రిలేషన్(Relation) గురించి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సలహాల(Advice)ను దృష్టిలో పెట్టుకొని కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేసి ఎవరి గేమ్(Game) వాళ్ళు ఆడుతారని ఆశిద్దాం .