వేరబుల్స్ ఆక్టివిటీ ట్రాకర్లు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. ఏ కాస్త ఆరోగ్య స్పృహ ఉన్న వారు కూడా ఈ వేరబుల్స్ ను ఒంటికి తగిలించుకుని కనిపిస్తున్నారు. మంచిదే. కానీ ఈ ఆక్టివిటీ ట్రాకర్లు అందించే సూచనలు ఎంత మందికి అర్ధం అవుతున్నాయి అన్నది ఒక ప్రశ్న. అదలా ఉంచితే, ఈ fitbit లేదా మరేదైనా వేరబుల్స్ ను మనం ఏదైనా ఆక్టివిటీ చేసేటప్పుడు గుర్తు పెట్టుకుని చేతికి లేదా మరే భాగానికైనా పెట్టుకుంటేనే ఈ వేరబుల్స్ అవి సూచించే సమాచారాన్ని ఇవ్వగలవు. అదే మనం మర్చిపోతే అంతే సంగతులు. అలా నెలలో కొన్ని రోజులు మర్చిపోతే, అది ఖచ్చితమైన సమాచారం ఇచ్చినా దానిలో కొంత లోపం ఉన్నట్టే మనం భావించాలి. ఇలా ఎందుకు అంటే వేరబుల్స్ ను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని వేసుకోవాల్సి రావడం వల్ల. అదే వేరబుల్స్ ప్రతీ రోజు మనం వేసుకునే బట్టలకు అంటిపెట్టుకుని ఉంటే ఎంత బావుంటుంది. సరిగ్గా, ఈ ఆలోచనతోనే Spire Health Tag ఆక్టివిటీ ట్రాకర్ రూపొందింది.

Spire సంస్థ సీఈఓ Jonathan Palley ఆక్టివిటీ వేరబుల్స్ లోని పై చెప్పిన లోపాన్ని గుర్తించి బట్టలకు ఎన్ని రోజులైనా అంటిపెట్టుకుని ఉండే ఆక్టివిటీ ట్రాకర్ Spire Health Tag ను రూపొందించారు. ఈ Spire Health Tag కూడా ఒక ఆక్టివిటీ ట్రాకరే. ఇది మన బొటన వేలి కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిని ఒక ప్రత్యేకమైన జిగురుతో తయారు చేయడం వల్ల మన బట్టలకు అంటిపెట్టుకుని ఉండగలదు. దీనిని మన లోపలి దుస్తులైన బనియన్ లేదా స్లిప్ లేదా ఇంకా లోదుస్తులకైనా అంటించుకోవాలి. లేదా మనం వ్యాయామం చేసే బట్టల లోపలి భాగంలోనైనా పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ Spire Health Tag మనం చేసే ఆక్టివిటీని గమనిస్తూ ఉంటుంది. ఈ పరికరం మన గుండె చప్పుడు, heart rate variability (hrv – ఇది స్ట్రెస్ ను సూచిస్తుంది) ఉచ్చ్వాస నిశ్వాసలు, వ్యాయామం మొదలైన వాటిని గమనిస్తుంది. ఇక దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి సంబంధించిన యాప్ లో మీరు అది సూచించే పలు రకాల లక్ష్యాలను ఎంచుకోవాలి. ఉదా: దీనిలో Stay active, Reduce stress, Sleep Better, Stay Calm, Heart health ఇలా పలు లక్ష్యాలు ఉంటాయి. వీటిలో ఎదో ఒకటి ఎంచుకుంటే ఆ లక్ష్యానికి తగ్గట్టు మీ రోజు ఉందా లేదా అన్నది అది యాప్ లో చెప్పేస్తుంది. అంతే వేరే వేరబుల్స్ లాగ కొంత వ్యాయామం చేసి ఏమిటి ఫలితం అని యాప్లలో చూడనక్కరలేదు. ఈ పరికరం కేవలం మీరు ఎంచుకున్న లక్ష్యానికి ఏమైనా భిన్నంగా మీ వ్యాయామం లేదా రోజు ఉంటే వెంటనే ఈ యాప్ లో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.

మీరు ఒకవేళ ఈ పరికరాన్ని మీ ఆఫీస్ బట్టలకు పెట్టుకున్నారు అనుకుంటే, ఈ రోజు ఉదయం మీకు stress కలిగితే అది యాప్ ద్వారా సూచిoచేస్తుంది. ‘నిన్నటి కంటే ఈ రోజు stress ఎక్కువైంది. ఒక పది నిముషాలు వాకింగ్ చేస్తే మంచిది’ అని సూచిస్తుంది. అదే మీరు అన్నీ పద్దతిగా చేస్తుంటే కొన్ని రోజుల పాటు మీకు ఏ నోటిఫికేషన్ రాదన్నమాట.
ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే దీనిని ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ తీయాల్సిన పని లేదు. మీ బట్టలతో పాటు వాషింగ్ మెషిన్ లో వేసినా ఈ వేరబుల్ అస్సలు పాడవదు. ఈ Spire Health Tag 18 నెలల పాటు పని చేస్తుంది. ఆ పైన దీనిని స్టోర్లో తిరిగి ఇచ్చేస్తే మరో Spire Health Tag ను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది ఈ సంస్థ.

ఇవి 3 pack – $99, 8 pack – $199. అంటే మనం రోజువారీ వేసుకునే బట్టలకు వీటిని తగిలించేస్తే ఇక మన ఆరోగ్యం గురించి మన కంటే ఇదే ఎక్కువ శ్రద్ధ తీసుకుoటుంది. అలా రోజుకు మూడు జతలు వేసుకంటాం అనుకుంటే వాటికి పెట్టుకునే విధంగా ఉండాలనే వీటిని 3 pack, 8 pack లలో విక్రయిస్తున్నారు.

Courtesy